తీవ్ర విషాదం.. 'జైలర్' నటుడు కన్నుమూత..

Published : Sep 08, 2023, 11:32 AM IST
తీవ్ర విషాదం.. 'జైలర్' నటుడు కన్నుమూత..

సారాంశం

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దర్శకుడు, మల్టీ టాలెంట్ యాక్టర్ జి మారి ముత్తు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 57 ఏళ్ల వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దర్శకుడు, మల్టీ టాలెంట్ యాక్టర్ జి మారి ముత్తు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 57 ఏళ్ల వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దీనితో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. 

శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుకి గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాదిరి ముత్తు 100కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. దర్శకుడిగా కూడా కొన్ని చిత్రాలు తెరకెక్కించారు. మారి ముత్తు చివరగా రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటించారు. విలన్ కి నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో మారి ముత్తు నటించడం విశేషం. 

మారి ముత్తుకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మారి ముత్తు మణిరత్నం, సీమాన్, యస్ జె సూర్య లాంటి దర్శకులకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో సైతం మారి ముత్తు నటించారు. అంతకు ముందు ఎనిమి, డాక్టర్ ఇలా వరుసగా పలు తమిళ చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. 

మారి ముత్తు యుక్తవయసులో అంటే 1990లో  సినిమాల పట్ల ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయి చెన్నై వచ్చారు. ఇంట్లో చిత్ర పరిశ్రమలోకి వెళ్ళడానికి అంగీకరించకపోవడంతో మారి ముత్తు పారిపోయి వచ్చారట. తాజాగా ఆయన మరణంతో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం