జ‌గ‌ప‌తిబాబుకి మండింది.. నిర్మాత, తెలంగాణ ఎమ్మెల్యే పై షాకింగ్ కామెంట్స్‌

By Surya Prakash  |  First Published Sep 20, 2023, 7:32 AM IST

తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మించారు. ఈ సినిమా రిజ‌ల్ట్‌పై ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తిబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 



 ఇవాళా,రేపూ సినిమాని నిర్మించటం ఒకెత్తు అయితే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లి హిట్ కొట్టడం మరో ఎత్తు. సినిమా రిజల్ట్ పై కేవలం దర్శక,నిర్మాతలే కాదు నటీనటులు సైతం ఆశపెట్టుకుంటారు. ఈ క్రమంలో సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోయినా, డిజాస్టర్ అయినా బాధ కలుగుతుంది. ఇలాంటి అనుభవమే జగపతిబాబు కీ రోల్ లో చేసిన రుద్రంగి సినిమాకు జరిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ఆయన మాటలో ఆవేదన, బాధ, జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్లని నిర్మాతపై కోపం కనపడ్డాయి.  

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రుద్రంగి సినిమా ఇటీవల థియేట‌ర్ల‌లో రిలీజైంది. మ‌మ‌తామోహ‌న్‌దాస్‌, విమ‌లారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. రుద్రంగి సినిమాను తెలంగాణ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ నిర్మించారు. ఈ సినిమా రిజ‌ల్ట్‌పై ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌ప‌తిబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

Latest Videos

జగపతిబాబు మాట్లాడుతూ.....రుద్రంగి క‌థ న‌చ్చ‌డంతో రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకొని ఈ సినిమా చేశాన‌ని జ‌గ‌ప‌తిబాబు అన్నాడు. సినిమా ప్రొడ్యూస‌ర్ ఎమ్మెల్యే అయినా స‌రిగా ప్ర‌మోష‌న్ చేయ‌లేక‌పోయాడ‌ని చెప్పాడు. సినిమా బాగా రావాల‌నే త‌ప‌న ప్రొడ్యూస‌ర్‌లో క‌నిపించ‌లేద‌ని జ‌గ‌ప‌తిబాబు పేర్కొన్నాడు. అందువ‌ల్లే నాలుగు రోజుల్లోనే రుద్రంగి సినిమాను థియేట‌ర్ల నుంచి ఎత్తేశార‌ని జ‌గ‌ప‌తిబాబు తెలిపాడు. దాంతో మంచి సినిమా అనాథ‌గా మారిపోయింద‌ని తెలిపాడు. దాదాపు ఏడు, ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రుద్రంగి సినిమాను తెర‌కెక్కించార‌ని, నాకున్న మార్కెట్‌కు ఆ రేంజ్ బ‌డ్జెట్‌ వ‌ర్క‌వుట్ కాద‌ని ముందే ఊహించాన‌ని జ‌గ‌ప‌తిబాబు అన్నాడు. రిలీజ్ డిలే అవుతుండ‌టంతో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుద‌ల చేయ‌మ‌ని ప్రొడ్యూస‌ర్స్‌కు చెప్పాన‌ని, కానీ విన‌లేద‌ని జ‌గ‌ప‌తిబాబు అన్నాడు.  రిజ‌ల్ట్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే రుద్రంగి త‌న కెరీర్‌లో బెస్ట్ మూవీ అని జ‌గ‌ప‌తిబాబు చెప్పాడు. జ‌గ‌ప‌తిబాబు కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.
 

click me!