హీరో నుండి విలన్ వరకు.. జగ్గుభాయ్ బర్త్ డే స్పెషల్!

First Published Feb 12, 2019, 11:28 AM IST

హీరో నుండి విలన్ వరకు.. జగ్గుభాయ్ బర్త్ డే స్పెషల్!

'మంచు మనుషులు' చిత్రంతో హీరోగా పరిచయమైన జగపతిబాబుకి 'అడవిలో అభిమన్యుడు' చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ సరైన సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయాడు.
undefined
దాదాపు ఆరేడు సినిమాల తరువాత 'పెద్దరికం' సినిమాతో జగపతి కెరీర్ కి మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ముగ్గురు అన్నల పట్టుదల, మొండితనంతో బాధపడే తమ్ముడిగా జగపతి నటన అందరికీ గుర్తుండిపోతుంది.
undefined
జగపతిబాబు తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'గాయం' ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.
undefined
కట్టుకున్న భార్య కోరికలు తీర్చలేక తనలో తనే ఇబ్బందిపడే మధ్యతరగతి భర్త పాత్రలో జగపతి బాబు నటనకి వంక పెట్టలేని విధంగా 'శుభలగ్నం' సినిమాలో నటించారు. ఈ సినిమాలో 'పొరుగింటి మంగళగౌరీ' అనే పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
undefined
జగపతి బాబు సినిమాల్లో దాదాపు ఇద్దరు హీరోయిన్లు కనిపించేవారు. వారిలో ఈ అక్కాచెల్లెళ్ళ స్టోరీ బాగా క్లిక్ అయింది.
undefined
వరుస సక్సెస్ లు అందుకుంటూ కెరీర్ మాంచి ఊపు మీదున్న సమయంలో 'కబడ్డీ కబడ్డీ' సినిమాలో నటించి మరో భారీ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా స్పూర్తితో టాలీవుడ్ లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.
undefined
హీరోగా ఎన్నో సక్సెస్ లు అందుకున్న జగపతిబాబుకి ఇండస్ట్రీలోకి కొత్త హీరోలు రావడంతో అవకాశాలు తగ్గాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం కూడా చేసుకోలేకపోతున్న సమయంలో 'లెజెండ్' సినిమాలో విలన్ గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. అంతే ఈ సినిమా తరువాత మరోసారి కెరీర్ పరంగా బిజీ అయిపోయాడు.
undefined
'నాన్నకు ప్రేమతో' సినిమాలో స్మార్ట్ గా కనిపించే విలన్ పాత్రలో ఒదిగిపోయాడు.
undefined
'రంగస్థలం' సినిమాలో జగపతిబాబు పాత్రకి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో తెలిసిందే. సర్పంచ్ గా ఆయన విలనిజం పండించిన తీరు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
undefined
'అరవింద సమేత'లో బసిరెడ్డి పాత్రలో జగపతిబాబుని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. రాయలసీమకి చెందిన ఫ్యాక్షనిస్ట్ గా అతడి పెర్ఫార్మన్స్ కి వంక పెట్టలేని విధంగా ఉంది.
undefined
click me!