ఆ రోజు ఈ బ్రతుకెందుకు అనిపించింది... జబర్దస్త్ మహేష్ కీలక వ్యాఖ్యలు!

Published : May 04, 2023, 12:18 PM ISTUpdated : May 04, 2023, 12:28 PM IST
ఆ రోజు ఈ బ్రతుకెందుకు అనిపించింది... జబర్దస్త్ మహేష్ కీలక వ్యాఖ్యలు!

సారాంశం

జబర్దస్త్ మహేష్ కెరీర్ బిగినింగ్ లో పడ్డ కష్టాలు చెప్పుకొచ్చారు. తండ్రి చనిపోతే అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవని వాపోయాడు.   

జబర్దస్త్ వేదికగా పాపులారిటీ తెచ్చుకున్న నటుల్లో మహేష్ ఒకరు. కిరాక్ ఆర్పీ టీమ్ లో ఎక్కువ కాలం చేసిన మహేష్.. తన మార్క్ కామెడీతో అలరించారు. జబర్దస్త్ లో చేస్తూ సినిమా ఆఫర్స్ కోసం ట్రై చేసేవాడు. మహానటి మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న చిన్న రోల్ చేశాడు. అయితే మహేష్ కి రంగస్థలం మూవీ గుర్తింపు తెచ్చింది. హీరో రామ్ చరణ్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ దక్కింది. రంగస్థలం బ్లాక్ బస్టర్ కాగా మహేష్ కి ఆఫర్స్ వరుస కట్టాయి. ప్రస్తుతం మహేష్ బిజీ ఆర్టిస్ట్. 

అయితే కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డాడట. ఆర్థికంగా దుర్భర పరిస్థితి చూసినట్లు మహేష్ ఆవేదన చెందారు. సినిమా మీద మక్కువ, నటుడు కావాలనే ఆశతో మహేష్ హైదరాబాద్ వచ్చారట. నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో మహేష్ తండ్రి చనిపోయారట. ఆ టైం లో చితికి కట్టెలు కొనడానికి కూడా మహేష్ దగ్గర డబ్బులు లేవట. జేబులో కనీసం రూ. 500 లేని ఆ సమయంలో... ఈ బ్రతుకు ఎందుకు అనిపించిందట. 

బంధువులు, మిత్రులు నీకు సినిమాలు అవసరమా... అని తిట్టారట. చాలా బాధపడ్డాడట. కొంచెం ఆలస్యమైనా దర్శకుడు సుకుమార్ తనకు రంగస్థలం మూవీలో ఆఫర్ ఇచ్చారని మహేష్ అన్నాడు. హీరోల్లో రవితేజ కామెడీ టైమింగ్ అంటే ఇష్టమన్న మహేష్, ఆయన ఏ సన్నివేశాన్ని అయినా వంద శాతం పండిస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఇల్లు లేకున్నా సొంతూరులో కొత్తగా కట్టుకున్నట్లు మహేష్ చెప్పారు. 

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చైతన్య మాస్టర్ మృతిపై మహేష్ స్పందించారు. చైతన్య టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ అని చెప్పిన మహేష్... శ్రీదేవి డ్రామా కంపెనీ షో కోసం నాకు డాన్స్ నేర్పాడని గుర్తు చేసుకున్నాడు. చైతన్య మరణవార్త కలచివేసిందని మహేష్ అన్నారు. కొద్దోగొప్పో పేరున్న చైతన్య పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్ళ సంగతేంటని వాపోయారు. కెరీర్ బిగినింగ్ లో తనకు కూడా తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని, ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నట్లు అన్నారు. ఒకరి ఫేమ్ ని బట్టి రెమ్యూనరేషన్ నిర్ణయిస్తారని మహేష్ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్