గర్భం దాల్చిన జబర్దస్త్ కమెడియన్... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న న్యూస్!

By Sambi ReddyFirst Published Apr 5, 2024, 10:56 AM IST
Highlights

జబర్దస్త్ లేడీ కమెడియన్ జోర్దార్ సుజాత తల్లి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాంతో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 
 

జోర్దార్ సుజాత బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యింది. 2020లో ప్రసారమైన సీజన్ 4లో సుజాత కంటెస్ట్ చేసింది. హోస్ట్ నాగార్జునను సుజాత బిట్టు అని పిలిచేది. మనం మూవీలో నాగార్జున పాత్ర పేరు బిట్టు కావడం విశేషం. కాగా సుజాత పెద్దగా  రాణించలేదు. ఐదు వారాలు హౌస్లో ఉన్న సుజాత ఎలిమినేట్ అయ్యింది. అనంతరం సుజాత జబర్దస్త్ కమెడియన్ గా మారింది. రాకింగ్ రాకేష్ టీమ్ లో స్కిట్స్ చేస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

ఈ క్రమంలో రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత మధ్య ప్రేమ చిగురించింది. జబర్దస్త్ వేదికపై రాకేష్ తమ ప్రేమ ప్రకటించాడు. సుజాతకు ప్రపోజ్ చేశాడు. గత ఏడాది సుజాత-రాకేష్ వివాహం చేసుకున్నారు. సుజాత కోడలిగా రావడంపై రాకేష్ తల్లి సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలంగా రాకేష్ ని ఎంత బ్రతిమిలాడుతున్నా పెళ్లి చేసుకోవడం లేదట. రాకేష్ తమ్ముడికి పెళ్ళై పిల్లలు ఉన్నారట. రాకేష్ మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండటాన్ని తల్లి భరించలేకపోయిందట. 

రాకేష్ ని ప్రేమలోకి దించి పెళ్ళికి ఒప్పించిన సుజాత అంటే ఆమె అత్యంత ఆప్యాయత కనబరుస్తుంది. తాజాగా సుజాత గుడ్ న్యూస్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సుజాత గర్భం దాల్చారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దాంతో ఆమె అభిమానులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . త్వరలో రాకింగ్ రాకేష్ తండ్రి కాబోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. 

జబర్దస్త్  కమెడియన్ గా కొనసాగుతూనే జోర్దార్ సుజాత నటిగా రాణిస్తుంది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్లో సుజాత కీలక రోల్ చేసింది. ప్రియదర్శి భార్య పాత్రలో నవ్వులు పూయిస్తుంది. సేవ్ ది టైగర్స్ సీజన్ వన్ అత్యంత ఆదరణ దక్కించుకుంది. దాంతో తాజాగా సీజన్ 2 కూడా అందుబాటులోకి తెచ్చారు. సుజాత ప్రియదర్శి భార్యగా మరోసారి ప్రేక్షకులను అలరించింది. సేవ్ ది టైగర్స్ సీజన్ 2 సైతం సూపర్ హిట్ అంటున్నారు ప్రేక్షకులు... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @insta_celebritycouple

 

 

click me!