సలార్‌ స్పెషల్‌ సాంగ్‌పై క్రేజీ రూమర్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ఆనందపడలా? బాధపడాలా?

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` మూవీ మేనియా ప్రారంభమవుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ  చేసింది యూనిట్‌. కానీ ఒక విషయం డార్లింగ్‌ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి  చేస్తుంది. 

item song in salaar prabhas fans worry about that arj

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` మూవీపై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఆయన నటించిన మూడు సినిమాలు డిజప్పాయింట్‌ చేయడంతో ఇక `సలార్‌`తోనైనా ఆ బాధ తీరుతుందని భావిస్తున్నారు. ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. `కేజీఎఫ్‌` తర్వాత ప్రశాంత్‌ నీల్‌ నుంచి వస్తోన్న మూవీ కావడం కూడా ఆ అంచనాలకు ఓ కారణం. 

ఈ మూవీ విడుదలకు ఇంకా నలభై రోజులుంది. నెమ్మదిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు పెంచారు. పోస్టర్లతో ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. ట్రైలర్‌ డేట్‌ కూడా ఇచ్చారు. ప్రభాస్‌ కొత్త లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. అంచనాలను పెంచుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా చిత్రీకరణ జరుపుతున్నారట. ఆర్‌ఎఫ్‌సీలో షూట్‌ చేస్తున్నారని సమాచారం. 

Latest Videos

అయితే ఇందులో ప్రభాస్‌ లేకపోవడం గమనార్హం. `సలార్‌`లో అదిరిపోయేలా స్పెషల్‌ సాంగ్‌ ని ప్లాన్‌ చేశారట దర్శకుడు. ప్రస్తుతం అది చిత్రీకరణ జ రుగుతుందట. అయితే ఇందులో ప్రభాస్‌ కనిపించడని లేటెస్ట్ టాక్‌. ఆయన లేకుండానే ఐటెమ్‌ సాంగ్‌ సాగుతుందని అంటున్నారు. సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ ఉన్నందుకు ఫ్యాన్స్ హ్యాపీ అవుతున్నారు. కానీ అందులో డార్లింగ్‌ కనిపించరనే వార్త డిజప్పాయింట్‌ చేస్తుంది. దీంతో అభిమానులు ఆనందపడాలా? బాధపడాలో అర్థం కావడం లేదు. ఓ రకమైన విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

ఇక భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో `సలార్‌`ని రూపొందిస్తున్నారు. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం `సలార్‌ః సీజ్‌పైర్‌` పేరుతో విడుదల చేయనున్నారు. పలు వాయిదాల అనంతరం డిసెంబర్‌ 22న క్రిస్మస్‌ కానుకగా సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. ఇందులో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా కనిపిస్తున్నారు. 
 

vuukle one pixel image
click me!