కాపీ కథతో ప్రభాస్ సినిమా..?

Published : Nov 22, 2018, 09:33 AM IST
కాపీ కథతో ప్రభాస్ సినిమా..?

సారాంశం

బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమాలకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. 

బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తరువాత తన తదుపరి సినిమాలకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు.

హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పీరియాడిక్ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ కొరియన్ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. 2001 లో వచ్చిన కొరియన్ మూవీ 'మై సిస్సీ గర్ల్' స్పూర్తిగా తీసుకొని దర్శకుడు రాధాకృష్ణ.. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని సమాచారం.

అప్పట్లో ఈ కొరియన్ సినిమా ఘన విజయం సాధించింది. పలు భాషల్లో ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు ఇదే కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాలో  హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Top 10 Heroes: సీఎం విజయ్ కి షాక్, అల్లు అర్జున్ కు పెద్ద దెబ్బ, టాప్ 10 హీరోల లిస్ట్.. ప్రభాస్ కు ఇక తిరుగులేదుగా..