
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 11న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడంతో చిత్ర యూనిట్ తిరిగి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. జనవరిలో సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు.
ఏది ఏమైనా రాధే శ్యామ్ చిత్రం మరికొన్ని రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతుండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. ప్రభాస్ కి జోడిగా ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులని సరికొత్త ప్రేమ లోకంలోకి తీసుకువెళ్లేందుకు ఈ జంట సిద్ధం అవుతున్నారు.
రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు తలెత్తాయట. దీని గురించి గతంలో మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ప్రభాస్, పూజా హెగ్డే ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారని సమాచారం.
పూజా హెగ్డే బిహేవియర్ ప్రభాస్ కు అంతగా నచ్చకపోవడంతో ఈ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. తాజాగా సమాచారం మేరకు పూజా హెగ్డే ప్రభాస్ కు సారీ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని అంటున్నారు.
ఇద్దరూ సంతోషంగా రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో కలసి పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారని అంటున్నారు. రాధే శ్యామ్ రిలీజ్ కి ముందు ఇది పాజిటివ్ సైన్ అనే చెప్పాలి.
ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ అయిన రాధే శ్యామ్ లో ప్రభాస్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోంది. విధికి, ప్రేమకు మధ్య జరిగిన యుద్ధంలాగా ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ అభివర్ణిస్తోంది.