Pawan kalyan: 160 కోట్ల విలువైన ల్యాండ్ లో లగ్జరీ ఫార్మ్ హౌస్ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్?

By Sambi Reddy  |  First Published Jul 30, 2022, 3:43 PM IST

పవన్ కళ్యాణ్ తన ఫార్మ్ ల్యాండ్ లో ఖరీదైన ఇంటి నిర్మాణం చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఉన్న ఇంటిని కూల్చేసి అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారన్న వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. 
 


ఖాళీగా ఉంటే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫార్మ్ హౌస్ కే పరిమితమవుతారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం ఆయనకు ఇష్టమైన చర్య. ఈ కార్యక్రమాలన్నీ ఆయన తన ఫార్మ్ హౌస్ లో నిర్వహిస్తూ ఉంటారు.అలాగే ఫార్మ్ హౌస్ లో పండిన ఆర్గానిక్ పండ్లు ఇష్టమైన వారికి పంపడం పవన్ కున్న మరొక అలవాటు. కాగా చాలా కాలం క్రితమే ఆయన 16 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగర శివారులో గల గండిపేట, చిలుకూరు మధ్య విస్తరించిన ఉన్న ఈ ల్యాండ్ లో పవన్ ఫార్మ్ హౌస్ నిర్మించుకున్నారు. 

సినిమాల షూటింగ్స్, రాజకీయ కార్యక్రమాలు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే గడుపుతారు. ఆవులకు మేత వేయడం, మొక్కలకు నీళ్లు, ఎరువులు వేయడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ 16 ఎకరాల ల్యాండ్ లో ఆయన ఫార్మ్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది. అయితే అది చిన్నది కావడంతో కూల్చేసి భారీగా అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారట. జ్వరం నుండి కోలుకున్న పవన్ రోజూ ఫారం హౌస్ కి వెళ్లి కొత్త ఇంటి నిర్మాణ పనులు చూసుకుంటున్నారని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ ఉన్న ఏరియాలో ఎకరం రూ. 10 కోట్ల మార్కెట్ వాల్యూ కలిగి ఉందట. అంటే పవన్ కి గండిపేటలో ఉన్న ఫార్మ్ హౌస్ ధర అక్షరాలా రూ. 160 కోట్ల రూపాయలు అన్నమాట. 

Latest Videos

ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్ధులు పక్క రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గుంటూరు, మంగళగిరి మధ్య ఓ ఇంటిని నిర్మిస్తున్నారట. ఇక సినిమాకు యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ కి ఇవన్నీ చాలా సులభం. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటించిన, చేస్తున్న చిత్రాలు అయోమయంలో పడ్డాయి. హరి హర వీరమల్లు పూర్తి చేయకుండానే ఆయన వినోదయ సిత్తం రీమేక్ మొదలుపెట్టారు. 
 

click me!