Ramarao On Duty collectoins: రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే కలెక్షన్స్... రవితేజకు బిగ్ షాక్!

By Sambi ReddyFirst Published Jul 30, 2022, 1:38 PM IST
Highlights

కెరీర్ లో దారుణమైన రికార్డు రవితేజ సొంతం చేస్తున్నారు హీరో రవితేజ. ఆయన లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద చతికలబడింది. రామారావు ఫస్ట్ డే కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు విస్మయానికి గురవుతున్నారు.

క్రాక్ మూవీతో హిట్ ట్రాక్ ఇచ్చిన రవితేజ(Raviteja) నెలల వ్యవధిలో రెండు చిత్రాలు విడుదల చేశారు. అరడజను సినిమాలు ప్రకటించిన రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ పై అభిమానులే మండిపడుతున్నారు. జులై 29న విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ చిత్రం పూర్తి స్థాయిలో నిరాశపరచగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ షో నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty collectoins) బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.  రవితేజ కెరీర్ కి రామారావు ఆన్ డ్యూటీ ఫెయిల్యూర్ పెద్ద దెబ్బగా అభివర్ణించవచ్చు. 

ఆయన అప్ కమింగ్ చిత్రాలపై రామారావు ఆన్ డ్యూటీ ప్రభావం పడుతుంది. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ రేటు పెట్టి కొనుగోలు చేయడానికి భయపడతారు. కేవలం రూ. 17.2 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రామారావు ఆన్ డ్యూటీ బ్రేక్ ఈవెన్ కావడం జరగని పనే. దానికి ఫస్ట్ డే వచ్చిన వసూళ్లే నిదర్శనం. బ్యాడ్ టాక్ నేపథ్యంలో రామారావు ఆన్ డ్యూటీ వసూళ్లు మధ్యాహ్నం నుండే పడిపోయాయి. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో రామారావు ఫస్ట్ డే వసూళ్ళు పరిశీలిస్తే.. నైజాంలో కేవలం రూ. 85 లక్షల షేర్ అందుకుంది. సీడెడ్ రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షల షేర్ రామారావు సినిమాకు దక్కింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డేకి గాను రూ. 2.82 కోట్ల షేర్ అందుకుంది. ఏపీ/తెలంగాణలు కలిపి రూ. 15 కోట్లకు రైట్స్ అమ్ముడుపోయాయి. అంటే కనీసం నాలుగులో వంతు వసూళ్లు కూడా రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి దక్కలేదు. డిజాస్టర్ టాక్ నేపథ్యంలో నేటి నుండి వసూళ్లు మరింత తగ్గనున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... రామారావు ఆన్ డ్యూటీ రూ. 2.82, ఖిలాడీ రూ. 4.30, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. అంటే డిస్కో రాజా మాత్రమే రామారావు ఆన్ డ్యూటీ కంటే తక్కువ షేర్ అందుకుంది. అత్యధికంగా క్రాక్ ఫస్ట్ డే షేర్ వసూలు చేసింది. రామారావు ఆన్ డ్యూటీ నిర్మాణంలో రవితేజ భాగస్వామిగా ఉండడం విశేషం. 

దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా... దివ్యాంష కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్స్ గా నటించారు. సామ్ సి మ్యూజిక్ అందించారు.సస్పెన్సు యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కించాడు. 

ఏరియా వైజ్ ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు... 

నైజాం : రూ. 85 లక్షలు 
సీడెడ్:రూ. 52లక్షలు ఉత్తరాంధ్ర : రూ.45లక్షలు 

తూర్పు: రూ.31లక్షలు 

పశ్చిమ: రూ.16లక్షలు

 గుంటూరు: రూ.24 లక్షలు 

కృష్ణ: రూ.17లక్షలు 

నెల్లూరు: రూ.12లక్షలు 

ఏపీ.తెలంగాణ  మొత్తం: రూ.2.82CR(4.75 కోట్ల  గ్రాస్)  

click me!