ఇంట్రెస్టింగ్ పాయింట్స్: మహేష్ ఫస్ట్ సినిమా రాజకుమారుడు..@20

First Published Jan 31, 2019, 6:18 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ మొదటి సినిమా రాజకుమారుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్
undefined
బాలా నటుడిగా మహేష్ 9 సినిమాలు చేశాడు. అయితే యువ హీరోగా మొదట ఎంట్రీ ఇచ్చింది మాత్రం రాజకుమారుడు సినిమాతో. 1999 జులై 30న ఈ సినిమా రిలీజయింది. అంటే మరికొన్ని నెలల్లో ఈ సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకోబోతోంది.
undefined
మహేష్ సరసన ఈ సినిమాలో ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది. ప్రేమంటే ఇదేరా సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమా ద్వారా మరో హిట్ అందుకొని ఆ తరువాత బాలీవుడ్ లో బిజీగా మారింది. మళ్ళీ అమ్మడు మరో తెలుగు సినిమా చేయలేదు.
undefined
మహేష్ ను హీరోగా పరిచయం చేయాలనీ అప్పట్లో కృష్ణ వద్దకు చాలా మంది దర్శకులు క్యూ కట్టారు. కృష్ణ మాత్రం దర్శకేంద్రుడిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. కె.రాఘవేంద్ర రావ్ టేకింగ్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
undefined
సీనియర్ నిర్మాత సి.అశ్విని దత్ ప్రొడక్షన్ వైజయంతిలో రాజకుమారుడు సినిమాను 5కోట్ల(అంచనా) బడ్జెట్ తో నిర్మించగా 10 కోట్ల షేర్స్ అందించింది.
undefined
సినిమా రిలీజ్ కు ముందే మణిశర్మ అందించిన సంగీతం బాగా క్లిక్ అయ్యింది. గోదారి గట్టుపైన.. ఇతర లవ్ సాంగ్స్ తో పాటు అన్ని పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అప్పటి నుంచి మాక్సిమమ్ మహేష్ మణిశర్మనే తన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకునేవారు.
undefined
మొదట రాజకుమారుడు సినిమాను 116 సెంటర్స్ లలో 78 ప్రింట్లతో రిలీజ్ చేశారు.
undefined
అయితే మొదటిరోజే మహేష్ రాజకుమారుడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మరిన్ని కాపీలకు బయ్యర్లు ఆర్దర్ చేశారు.
undefined
సినిమా 80 సెంటర్లలో పైగా 50 రోజులు ఆడింది. ఇక 44 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
undefined
సినిమా కమర్షియల్ గా హిట్టవ్వడంతో మహేష్ కు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. యువరాజు - వంశీ సినిమాలను మహేష్ వెంటవెంటనే ఒప్పుకున్నాడట.
undefined
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా మహేష్ ఇప్పటివరకు 24 సినిమాలను హీరోగా పూర్తి చేశాడు.
undefined
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన 25వ సినిమా 'మహర్షి'తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
undefined
click me!