
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ (Nikhil).. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘కార్తికేయ 2’. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. కార్తికేయ 2ని ప్రపంచవ్యాప్తంగా జులై 22 న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెచుతోంది. సముద్రం మధ్యలో ఓ మినీ షిప్ లో నిఖిల్, అనుపమా, మరో పూజారి కనిపిస్తున్నారు. సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఆత్రుత వారి మొహంలో కనిపిస్తోంది. చుట్టు మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా ఇంట్రెస్టింగ్ డైలాగ్ ను కూడా వదిలారు. ‘సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యం ఈ ద్వారక నగరం’ అంటూ నిఖిల్ చెప్పే మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
మేకర్స్ కార్తీకేయ 2 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సందర్భంగా మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. తమ సినిమాను జులై 22న ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ కు ఇంకాస్త సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శ్రీకృష్టుడి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు ద్వారక, ద్వాపర యుగంలో ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఆ లింక్ లోనే కార్తికేయ శ్రీ కృష్ణుడి గురించి వెతికే ఒక ప్రయాణమే కార్తీకేయ 2. శ్రీ కృష్ణుడిని అన్వేషిస్తూ డాక్టర్ కార్తికేయ చరిత్రలోకి ఎంటరవుతూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలోని భావాన్ని పోస్టర్ ద్వారా దర్శకుడు చందు మొండేటి ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మోషన్ పోస్టర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. హీరోహీరోయిన్లుగా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ పలు పాత్రలను పోషిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.