Ram Pothineni: రామ్, బోయపాటి మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ ?

Published : Jun 17, 2022, 05:26 PM IST
Ram Pothineni: రామ్, బోయపాటి మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ ?

సారాంశం

రామ్ ప్రస్తుతం వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' మూవీలో నటిస్తుంది. రామ్ నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతోంది.

నటన, డాన్స్, ఎనెర్జీ ఇలా అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న నటుడు రామ్ పోతినేని. కానీ రామ్ ఎప్పుడూ స్టార్ అనిపించుకోవడానికి ఒక అడుగు దూరంలోనే నిలిచిపోతున్నాడు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ కు కావాల్సిన ఊపు తెచ్చిపెట్టింది. రామ్ ఇక స్టార్ గా ఇంకా గొప్పస్థాయికి చేరుతాడా లేదా అనేది అతడి ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. 

అందుకు తగ్గట్లుగానే రామ్ ప్రస్తుతం వరుసగా యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' మూవీలో నటిస్తుంది. రామ్ నెక్స్ట్ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతోంది. పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర రూమర్ వైరల్ గా మారింది. రామ్ మూవీ కోసం బోయపాటి బాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన గ్లామర్ తో పరిణీతి చోప్రా ఎంత క్రేజ్ తెచ్చుకుంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి రామ్ కి మెయిన్ ఫీమేల్ లీడ్ గా పరిణీతితో సంప్రదింపులు జరుపుతున్నారట. దాదాపుగా పరిణీతి ఖరారయ్యే ఛాన్స్ ఉంది. 

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. అందువల్లే హిందీ ఆడియన్స్ కోసం నార్త్ హీరోయిన్స్ వెంట పడుతున్నారు. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఓ తెలుగు బ్యూటీ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో