గల్లా జయదేవ్ కుమారుడి సినిమా నాగ చైతన్య చేతుల్లోకి ?

Published : Sep 13, 2019, 08:36 PM IST
గల్లా జయదేవ్ కుమారుడి సినిమా నాగ చైతన్య చేతుల్లోకి ?

సారాంశం

అక్కినేని హీరో నాగ చైతన్య ఈ ఏడాది మజిలీ చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంత, నాగ చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం యువతని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. 

నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించే మహా సముద్రం చిత్రంలో కూడా చైతూనే హీరో అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ నాగచైతన్య పాకెట్ లో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. చైతు, యంగ్ బ్యూటీ రష్మిక మందన జంటగా ఓ చిత్రంలో నటించబోతున్నారట. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి 'అదే నువ్వు అనే నేను' అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఓ డెబ్యూ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ కథని ముందుగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ కోసం అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల నాగ చైతన్య వద్దకు ఈ ప్రాజెక్ట్ చేరినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Duvvada Srinivas: చీరలమ్మి 7 నెలల్లో 12 కోట్లు సంపాదించా, సక్సెస్ అంటే ఇది
Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?