RRR: దానయ్యతో ఆ కంపెనీ మెగా డీల్.. అప్పుడే అడ్వాన్స్ చేతికి!

By tirumala ANFirst Published Jul 26, 2019, 3:04 PM IST
Highlights

బాహుబలి తర్వాత రాజమౌళి తెరక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇది. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. 

ఈ చిత్రం ప్రారంభమైనప్పటి నుంచి బిజినెస్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కాలేదు. కానీ ఈ చిత్ర హక్కులని దక్కించుకునేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలన్నీ ఎదురుచూస్తున్నాయి. 

ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ హక్కుల విషయంలో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దుబాయ్ కి చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ దానయ్యతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అని భాషల్లో ఓవర్సీస్ లో రిలీజ్ చేసేందుకు ఈ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దానయ్యతో 65 కోట్ల డీల్ కుదిరిందట. అడ్వాన్స్ గా 30 కోట్లు చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా సమాచారం లేకున్నా చిత్ర పరిశ్రమలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే నిర్మాతకు 30 కోట్లు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఆరంభంలోనే తనకు ఓ ప్రతిపాదన వచ్చినట్లు దానయ్య ప్రెస్ మీట్ లో తెలిపాడు. ఈ చిత్రాన్ని వదులుకుంటే 100 కోట్లు ఇస్తామని కొందరు ప్రతిపాదించిన విషయాన్ని దానయ్య తెలిపాడు. 

click me!