
సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు ఎప్పటికప్పుడు హ్యాకర్ల ఆటకట్టిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం ఎత్తుకుపై ఎత్తువేస్తున్నారనడం ఏమాత్రం సందేహం లేదు. సైబర్ క్రైమ్స్ నియంత్రణకు పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు, బ్యాంక్ ఖాతా వినియోగదారులకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ.. సైబర్ నేరగాళ్ల ఉచ్చు నుంచి ఎలా తప్పించుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. పట్టణాలతో పాటు.. పల్లెల్లోనూ అవేర్ నెస్ ప్రొగ్రామ్స్ నిర్వహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన పెంచుతున్నారు. అయినా సైబర్ నేరగాళ్లు అమీబాలా ఎప్పటికప్పుడు తమ రూపం మార్చుకుంటూ దోపిడీకి పాల్పడుతూనే ఉన్నారు.
తాజాగా దేశమంతటా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘ది కాశ్మీర్ ఫైల్స్) (The Kashmir files) మూవీని తమ దోపీడీకి ఆయుధంగా వాడాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు సెలబ్రెటీస్, పోలిటిషన్స్, పబ్లిక్ ఫిగర్స్ తప్పకుండా అందరూ ది కాశ్మీర్ ఫైల్స్ చూడాలని చెబుతుండటం కూడా వీరికి అవకాశంగా మారింది. దీంతో హాకర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ ను ఉచితంగా చూడండి అంటూ టార్గెటెడ్ వాట్సప్ నెంబర్ కు మూవీ లింక్ ను పంపిస్తున్నారు. సదరు వ్యక్తి లింకును ఓపెన్ చేసి మూవీ చేసే క్రమంలో.. ఫోన్ ను హ్యాక్ చేసి ఖాతాను కొల్లగొడుతున్నారు.
నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ (నోయిడా) రణవిజయ్ సింగ్ ఈ విషయంపై ఇప్పటికే ఓ నేషనల్ మీడియాకు స్పందించారు. బోగస్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కస్టమర్లకు కాశ్మీర్ ఫైల్స్ వీడియో అందదని స్పష్టం చేశారు. అయితే సైబర్ నేరగాళ్లు ఫోన్ నంబర్‌తో అనుబంధించబడిన స్మార్ట్‌ఫోన్‌లు, ఖాళీ బ్యాంకు ఖాతాలను హైజాక్ చేయగలరని సింగ్ తెలిపారు.
అయితే.. సినిమా పేరును ఉపయోగించుకున్న నిర్దిష్ట సందర్భం ఇంకా ఏదీ లేదని.. అయితే వ్యక్తుల ఫోన్‌లను హ్యాక్ చేయడానికి లేదా డబ్బును మోసగించడానికి కాన్మెన్ అటువంటి విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు ఇన్‌పుట్‌లు ఉన్నాయని తెలిపారు. కానీ వాట్సాప్ కు వచ్చే కొన్ని లింక్ లు ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఫ్రీస్ట్రీమింగ్‌గా అంటూ కొన్ని స్పెడ్ అవుతున్నాయని తెలిపారు. ఇదే విషయం పై రాచకొండ పోలీసులు కూడా స్పందించారు.
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఉచితంగా చూడండి అంటూ వాట్పాప్ కు ఎలాంటి లింకులు వచ్చినా క్లిక్ చేయొద్దని.. అలాగే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. 1920 నెంబర్ కు కాల్ చేసిన లింకుకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేస్తే జరిగే నష్టాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుందని సూచించారు. ఇక ‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీకి దేశమంతటా పెద్ద ఎత్తున ఆడియెన్స్ నుంచి స్పందన వస్తోంది. రోజురోజుకు ఈ చిత్రం మరింత గుర్తింపు పొందుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.