వివాదంలో స్టార్ సింగర్ చిత్ర, విమర్శలు చేస్తున్ననెటిజన్లు. కారణం ఇదే..?

Published : Jan 17, 2024, 10:32 PM IST
వివాదంలో స్టార్ సింగర్ చిత్ర, విమర్శలు చేస్తున్ననెటిజన్లు. కారణం ఇదే..?

సారాంశం

ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లదు స్టార్ సింగర్ చిత్ర. తాజాగా ఆమెకు సబందించిన ఓ వివాదం వైరల్ అవుతోంది. విమర్శకు కారణం అవుతోంది.   

స్టార్ సింగర్ చిత్ర తెలియనివారు అంటూ ఉండరు. ఇండియాలో ప్రముఖ గాయణీమణుల్లో ఆమె ఒకరు. వేలాదిగా పాటలు పాడిన అరుదైన సింగర్స్ లో ఆమె కూడా ఒకరు.  ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న చిత్ర.. ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు. ఎవరి ఊసు లేకుండా ఆమె పనేంటో ఆమె చేసుకుంటుంది. అంతే కాదు ఆమె వ్యవహార శైలి కూడా సున్నితంగా ఉంటుంది. వివాదాలకుదూరంగా ఉండే చిత్రను ఓవివాదం వెతుక్కుంటూ..వచ్చింది. ఆమె ఏ తప్పు చేయకుండా.. అనవసరంగా చిత్రను వివాదంలోకి లాగి విమర్శిస్తున్నారు ఇంతకీ విషయం ఏంటంటే..?  

 ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సామన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ.. అందరూ పాల్గొనడానికి సిద్దం అవుతున్నారు. కొందరు సెలబ్రిటీలు.. ఈ పవిత్ర కార్యానికి స్వచ్చందంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అందులో భాగంగా సింగర్ చిత్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ప్రజలందరూ శ్రీరామ నామాన్ని స్మరించాలని, సాయంత్రం వేళ ఇంటి ప్రాంగణాల్లో ఐదు దీపాలను వెలిగించాలని కోరుతూ చిత్ర రీసెంట్ గా  ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో  వైరల్ అవుతూ వస్తోంది. 

ఇక విస్త్రతంగా నెట్టింట్లో తిరుగుతున్న ఈ  వీడియోపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు ఈ వీడియోపై  పలువురు ప్రముఖులు   నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ రాజకీయ పక్షానికి మద్దతుగానే ఆమె ఈ వీడియోను విడుదల చేసిందని అంటున్నారు. ఆమె స్థాయి గాయని రాజకీయాలకు అతీతంగా ఉంటే మంచిదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే చిత్రకు కొంత మంది సింగర్స్ అండగా నిలుస్తున్నారు. గాయకుడు జీ.వేణుగోపాల్‌  చిత్రకు మద్దతుగా నిలిచాడు. భారతీయ పౌరురాలిగా ఆమె భావ ప్రకటన స్వేచ్ఛను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం ప్రస్తుతం సౌత్ లో  చర్చనీయాంశంగా మారింది.

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్