ప్రముఖ నేపథ్య గాయని చిత్రకి పద్మ భూషణ్‌ పురస్కారం.. ప్రకటించిన కేంద్రం

Published : Jan 25, 2021, 09:52 PM IST
ప్రముఖ నేపథ్య గాయని చిత్రకి పద్మ భూషణ్‌ పురస్కారం.. ప్రకటించిన కేంద్రం

సారాంశం

ప్రముఖ నేపథ్య గాయని చిత్రకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిత్రని పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది. దేశంలోనూ మూడో అత్యున్నత పురస్కారం లెజెండరీ సింగర్‌ చిత్రకి దక్కడం విశేషం. రిపబ్లిక్‌ డే సందర్భంగా చిత్ర ఫ్యాన్స్ కి కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్‌ ఇచ్చిందనే చెప్పాలి.

ప్రముఖ నేపథ్య గాయని చిత్రకి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిత్రని పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది. దేశంలోనూ మూడో అత్యున్నత పురస్కారం లెజెండరీ సింగర్‌ చిత్రకి దక్కడం విశేషం. రిపబ్లిక్‌ డే సందర్భంగా చిత్ర ఫ్యాన్స్ కి కేంద్ర ప్రభుత్వం సర్‌ప్రైజ్‌ ఇచ్చిందనే చెప్పాలి. మరోవైపు గాన గాంధర్వుడు ఎస్పీబాలుకి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాదికిగానూ కేంద్రం పద్మ అవార్డులను సోమవారం ప్రకటించింది. ఇందులో 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా, ఏడుగురికి పద్మ విభూషణ్‌, పది మందికి పద్మ భూషణ్‌ పురస్కరాలు, 102 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. సినిమా రంగం నుంచి ఎస్పీ బాలు, చిత్రలతోపాటు కేరళాకి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు కైతప్రమ్‌ డామోదరన్‌ నంబూథిరి వంటి వారికి పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్రం. 

గాయని చిత్ర ప్లే బ్యాక్‌ సింగర్‌గా  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒరియా, పంజాబి, గుజరాత్‌, తులు, రాజస్తాని, ఉర్దు, ఇలా దాదాపు 15 భాషల్లో వేల పాటలు పాడారు. ఆరు జాతీయ అవార్డులు అందుకున్నారు. అనేక ఇతర రాష్ట్రాల పురస్కారాలు పొందారు. 2005లో ఆమెకి కేంద్ర పద్మ శ్రీ అవార్డుని ప్రకటించగా, ఇప్పుడు పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు