స్టార్ హీరో ఇంటిపై ఐటీ దాడులు!

Published : Sep 29, 2018, 10:14 AM IST
స్టార్ హీరో ఇంటిపై ఐటీ దాడులు!

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. కిల్పాక్‌లోని విజయ్‌ ఇంటిలో, వలసరవక్కంలోనివిజయ్ సేతుపతి ఆఫీసులో ఈ దాడులను నిర్వహించారు. విజయ్ కి ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిసీలించినట్లు తెలుస్తోంది. 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. కిల్పాక్‌లోని విజయ్‌ ఇంటిలో, వలసరవక్కంలోని విజయ్ సేతుపతి ఆఫీసులో ఈ దాడులను నిర్వహించారు. విజయ్ కి ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది.

సాధారణ తనీఖీల్లో భాగంగానే ఐటీ శాఖ ఈ దాడులను జరిపారని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివున్నాయి. ఇటీవలే విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన 'నవాబ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది.

అలానే విజయ్ సేతుపతి తెలుగులో మెగాస్టార్ 'సై రా' సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ 'పేటా' సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లారు. ఆయన లేని సమయంలో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

CM Vijay: సీఎం చైర్‌ చూడగానే విజయ్‌కి గుర్తొచ్చిన సినిమా ఇదే.. అర్జున్‌తో మనసులో మాట బయటపెట్టిన దళపతి
Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు