సూర్యకు హ్యాండ్ ఇచ్చి.. శ్రీహాన్ కు దగ్గరవుతున్న ఇనయా, ఆహారం ఆశచూపి ఆటాడేసుకుంటున్న బిగ్ బాస్

Published : Oct 20, 2022, 12:15 AM IST
సూర్యకు హ్యాండ్ ఇచ్చి..  శ్రీహాన్ కు దగ్గరవుతున్న ఇనయా, ఆహారం ఆశచూపి ఆటాడేసుకుంటున్న బిగ్ బాస్

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో ఈ వారం అంతా గందరగోళంగా ఉంది. ఆహారం కోసం హౌస్ లో అంతా ఆహాకారాలు చేస్తుండగా.. చేసిన తప్పుకు బిగ్ బాస్ గట్టిగానే శిక్ష విధించాడు. ఇక  ఈ మధ్యలో ఎవరూ  ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో.

ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో చాలా విచిత్రాలు జరిగాయి. సీజన్ స్టార్టింగ్ నుంచి శత్రువులుగా మిగిలిపోయిన ఇనయా‌, శ్రీహాన్ లు దాదాపు కలిసిపోయారు. సూర్య మీద కోపం వల్లో.. లేక..నిజంగా మనసులోంచి వచ్చిందో తెలియదు కాని.. ఇనయా మాత్రం శ్రీహాన్ ను పొగిడేసింది. మొదటి నుంచి వస్తున్న గొడవల వల్ల నిన్నునామినేట్ చేశాను కాని..నిజంగా ఈ వారం నిన్నుఅనడానికి ఏమీ లేదు. నువ్వు చాలా అద్బుతంగా ఆడుతున్నావ్ అంటూ శ్రీహాన్ కు సపోర్ట్ గా నిలిచింది. 

ఇన్ని రోజులుగా బాగా క్లోజ్ గా ఉంటూ వస్తున్న ఇనయా, సూర్య మధ్య కాస్త గ్యాప్ కనిపిస్తుంది. ఇక టాస్క్ లో భాగంగా హౌస్ మెంట్స్ చేసిన తప్పులకు అందరికి ఆకలి శిక్ష విధించాడు బిగ్ బాస్. ఇక సూర్య తను కెప్టెన్ గా ఫెయిల్ అయ్యానంటూ తెగ బాధపడిపోయాడు. అటు ఇంట్లో ఏం లేకుండా ఫుడ్ అంతా బిగ్ బాస్ తీసుకెళ్ళి.. ఆకలి విలువ వారికి తెలిసేలాచేయాలి అనుకున్నాడు. 

ఈలోపు ఆహారం లేక హౌస్ లో ఎవరికి వారు డీలా పడిపోయారు. చాలా మంది ఆశగా దాచుకున్న తిండి అంతా తీసుకెళ్లడంతో పాటు..ఎవరైనా దాచుకుని ఉంటే వాటిని కూడా తీసుకువచ్చి స్టోర్ రూమ్ లో పెట్టాలంటూ బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు. దాంత ఇంట్లో ఏం లేకుండా  తిండి అంతా స్టోర్ రూమ్ లోకి  పంపిచారు. హౌస్ ను రెండు గ్రూపులుగా విభజించి గేమ్స్ ఆడిస్తూ.. గెలిచినవారికి మాత్రమే ఆహారం అందిస్తున్నాడు బిగ్ బాస్. 

అంతే కాదు ఒకగ్రూప్ వచ్చిన ఆహారం మరొక గ్రూప్ తీసకోకూడదు అని నిబంధనకూడా పెట్టారు. దాంతో మొదటి రౌండ్ లో భాగంగా టీమ్ కబడ్డి ఆడి దాల్,రైస్ గెలుచుకున్నారు. ఇక మరొక రౌండ్ లో సెకండ్ టీమ్ మెంబర్స్ బాల్స్ గేమ్ ల్ గెలిచి చపాతీలు గెలుచుకున్నారు. అంతకు ముందు ఆది రెడ్డిని, బాలాదిత్య హార్ట్ అయ్యేలా మాట్లాడింది  గీతు. ఆదిరెడ్డ అసలు గేమ్ ఆడలేదంటూ ముఖం మీదే చెప్పేసింది. అటు బాలాదిత్యను కూడా ఇన్ మెచ్యూర్ అంటూ కామెంట్లు చేసింది. 

ఇక బిగ్ బాస్ గేమ్ రూల్స్ ను బ్రేక్ చేశారు గీతూ ఆదిరెడ్డి. ఒకరికోసం పంపిన ఫుడ్ నువేరోకరు తినకూడదు అని బిగ్ బాస్ చెప్పినా వినకూడా తిన్నందుకు గీతూకి, ఆదిరెడ్డికి అంట్లు కడిగే పని పెట్టారు. భారీ కళాయిలు వారి చేత తోమించాడు బిగ్ బాస్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది