గంజాయ్ అలవాటు ఉందన్న డైరక్టర్, షాక్ లో ఇండస్ట్రీ!

Published : Aug 25, 2019, 11:26 AM IST
గంజాయ్ అలవాటు ఉందన్న డైరక్టర్, షాక్ లో ఇండస్ట్రీ!

సారాంశం

భాగ్యరాజా మాట్లాడుతూ...ఒకసారి తన అసెస్టెంట్ ఒకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. 

గంజాయి అలవాటు ఉన్నవాళ్లు ఆ విషయం బయిట పెట్టడానికి ఇష్టపడరు. అయితే ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఓ తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా  వచ్చిన ఆయన తనలాగా ఎవరూ గంజాయి కు అలవాటు పడద్దని అన్నారు. అయితే ఈ విషయం  విన్నవారు భాగ్యరాజా కు గంజాయ్ అలవాటు ఉండటం ఏమిటని షాక్ అవుతున్నారు.

భాగ్యరాజా మాట్లాడుతూ...ఒకసారి తన అసెస్టెంట్ ఒకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గంజాయి తీసుకుంటే ఎందుకో కారణం తెలియకుండానే నవ్వేస్తుంటామని చెప్పారు.

అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్‌ తాగడం కూడా మానేశానని చెప్పారు.  ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు.  గంజాయి వంటి అలవాటు వలన కొత్తగా ఎనర్జీ ఏమీ జనరేట్ కాదన్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు