తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు. థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది.
టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తమ సినిమాలలో క్యామియోలు చేస్తుంటారు. అలానే వేరే వాళ్ల సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తుంటారు. తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం తన ముఖానికి రంగేసుకొని ప్రేక్షకులను పలకరించాడు.
అసలు విషయంలోకి వస్తే ఇటీవల విడుదలైన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో సుకుమార్ కనిపించాడు. ఈ సినిమాలో నాని రైటర్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అతను హాలీవుడ్ సినిమాలను చూసి నవలలు రాస్తుంటాడు. ఊహించని విధంగా అతడి జీవితంలోకి ఐదుగురు ఆడవాళ్లు రావడం, వారి రివెంజ్ లో భాగమై.. ఆ జర్నీనే కథగా మలుస్తాడు. ఇది దర్శకుడైన సుకుమార్ కళ్లలో పడి.. దాని ఆధారంగా సినిమా తీయలనుకుంటాడు.
undefined
ఇలా కొసమెరుపులా సినిమాలో సుకుమార్ ఎంట్రీ ఉంటుంది. తాను తెలుగు సినిమాలు తీస్తుంటానని సుక్కు పరిచయం చేసుకుంటే.. తాను తెలుగు సినిమాలు పెద్దగా చూడనని.. మీరెవరో నాకు తెలియదు అని నాని అంటాడు.
థియేటర్ లో ఈ సీన్ బాగా పండింది. క్లైమాక్స్ లో వచ్చే ఈ సీన్ ఆడియన్స్ ని బాగా నవ్వించింది. ఇది ఇలా ఉండగా.. సుకుమార్ మరో సినిమాలో కూడా క్యామియో చేశాడు. అదే 'వాల్మీకి'. ఈ సినిమాలో కూడా తన నిజజీవితంలో మాదిరి డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.