కంగనాకు ఈ సారి హృతిక్ దెబ్బ?

Published : Jun 03, 2019, 02:01 PM IST
కంగనాకు ఈ సారి హృతిక్ దెబ్బ?

సారాంశం

బాలీవుడ్ లో గత కొంత కాలంగా హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కంగనా తన ఘాటు  వ్యాఖ్యలతో హృతిక్ ఇమేజ్ పై పొడిస్తే.. హృతిక్ మాత్రం తన మాటలతో కౌంటర్ ఇస్తుంటాడు. ప్రతిసారి ఈ విధంగా వివాదాలు జరుగుతూ వస్తున్నాయి. 

అయితే సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఇద్దరు పోటీపడిన సందర్భాలు లేవు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. హృతిక్ నటించిన సూపర్ 30 జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను మొదట జులై 26న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక అదే రోజు కంగనా మెంటల్ హై క్యా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. 

దీంతో ఒక్కసారిగా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై చర్చ జరిగింది. అయితే హృతిక్ మళ్ళీ వివాదాలెందుకని వచ్చే ఏడాదికి సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నాడు. మళ్లీ ఏమైందో ఏమో గాని కంగనా సినిమా కంటే ముందే జులై 12న రిలీజ్ కానుంది. ఓ విధంగా కంగనాకు ఝలక్ ఇచ్చి హృతిక్ దెబ్బ కొట్టినట్లు సోషల్ మీడియాలో టాక్ వైరల్ అయ్యింది.

PREV
click me!

Recommended Stories

Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Mahesh Babu: బ్రహ్మోత్సవం లాంచ్ కి ముందే డైరెక్టర్ కి ఈమెయిల్ పంపా, పట్టించుకోలేదు.. అందుకే అట్టర్ ఫ్లాప్