మానసికంగా వేధిస్తున్నారు.. హృతిక్ రోషన్ కామెంట్స్!

By AN TeluguFirst Published May 10, 2019, 10:03 AM IST
Highlights

గత కొంతకాలంగా స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. 

గత కొంతకాలంగా స్టార్ హీరో హృతిక్ రోషన్, కంగనాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా హృతిక్ నటించిన 'సూపర్ 30', కంగనా నటించిన 'మెంటల్ హై క్యా' సినిమాలు ఒకేరోజు జూలై 26న బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో హృతిక్ అభిమానులు కంగనాని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇది చూసిన కంగనా సోదరి రంగోలి.. దీనివెనుక ఉండి నడిపిస్తుంది హృతిక్ అంటూ అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. హృతిక్ ని తక్కువ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

దీంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అయితే ఈ వివాదం విసిగిపోయిన హృతిక్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'సూపర్ 30' రిలీజ్ డేట్ మార్చాలని కోరారు. మీడియాలో ఓ వర్గం తన సినిమాను తక్కువ చేయాలని చూస్తుందని హృతిక్ అన్నారు. వ్యక్తిగతంగా, మానసికంగా ఎంతో వేదనకు గురిచేస్తున్నారని, దీని నుండి బయట పడాలంటే తన సినిమా రిలీజ్ డేట్ మార్చాలని, దానికోసం నిర్మాతలను కోరుతున్నట్లు చెప్పారు.

సినిమా అంతా సిద్ధమైందని, అయినా కూడా మంచి రిలీజ్ డేట్ చూసి నిర్మాతలు విడుదల తేదీనీ మార్చాలని అన్నారు. చాలా కాలంగా తనను ఎన్నో అవమానాలకు గురి చేసినా.. తను ఓపికగా భరిస్తూ వస్తున్నానని అన్నారు. 
 

pic.twitter.com/aUzmDdf9yP

— Hrithik Roshan (@iHrithik)

''హృతిక్‌.. చూస్తూ ఉండు.. కంగన నిన్నేం చేస్తుందో..'' 

click me!