స్టార్ హీరో ఇంట విషాదం!

Published : Aug 07, 2019, 01:57 PM IST
స్టార్ హీరో ఇంట విషాదం!

సారాంశం

హృతిక్‌ తాత, లెజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ జే. ఓం ప్రకాష్‌ బుధవారం కన్నుమూశారు. 93 సంవత్సరాల ఓం ప్రకాష్‌ వృద్ధాప్యం కారణంగా మరణించారు  

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. హృతిక్ తాత, లెజండరీ ఫిల్మ్ మేకర్ ఓం ప్రకాష్ బుధవారం నాడు కన్నుమూశారు. 93 ఏళ్ల ఓం ప్రకాష్ ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఆప్‌ కే సాథ్‌, ఆఖిర్‌ క్యోం, అర్పణ్‌, ఆస్‌పాస్‌, ఆశ, ఆక్రమణ్‌,ఆప్‌ కీ కసమ్‌ వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఆంధీ, ఆంఖో ఆంఖో మే, ఆయా సవాన్‌ ఝూమ్‌ కే వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.వృద్ధాప్యం కారణంగా ఆయన మరణించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం హృతిక్ తన తాత సూపర్ టీచర్ అని, జీవితంలో ప్రతీ దశలోనూ ఎలా ఉండాలో తనకు నేర్పించారని.. బలహీనతలను అధిగమించేలా తనను తీర్చిదిద్దారని చెప్పారు. తన తాతకు సంబంధించిన చాలా విషయాలను హృతిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారు.

గత ఏడాది ఓం ప్రకాష్‌ 92వ జన్మదినం సందర్భంగా హృతిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లోనూ ఆయన గురించి పలు వివరాలు వెల్లడించారు. పుస్తకాలు కొనుక్కోవడానికి ఒక దశలో తన వెడ్డింగ్ రింగ్ అమ్మేశారని, వీధిదీపాల కింద చదువుకొని జ్ఞానం పెంచుకొని సినిమాల్లోకి వచ్చారని ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు హృతిక్. 

PREV
click me!

Recommended Stories

Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Cannes 2026: రెడ్ కార్పెట్‌పై అలియా నుంచి అదితి వరకు.. భర్తకు విడాకులిచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ