ఈ ఏడాది ఫస్ట్ బిగ్ డిజాస్టర్ ఇదే, నష్టాలు ఎన్ని కోట్లో తెలుసా.. మెగా హీరోకి వార్నింగ్ బెల్

By tirumala AN  |  First Published Feb 11, 2024, 11:23 AM IST

సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ లాంటి హిట్ తర్వాత వచ్చిన చిత్రం ఫైటర్. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తొలి ఇండియన్ చిత్రం ఇది. 


సిద్ధార్థ్ ఆనంద్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ లాంటి హిట్ తర్వాత వచ్చిన చిత్రం ఫైటర్. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన తొలి ఇండియన్ చిత్రం ఇది. హృతిక్, దీపికా పదుకొనె, అనిల్ కపూర్ ఇలా స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ ఎయిర్ ఫోర్స్ చిత్రంలో కూడా సిద్దార్థ్ ఆనంద్ దీపికా పదుకొనెని బాగా బోల్డ్ గా చూపించాడు. హృతిక్, దీపికా లిప్ కిస్ సన్నివేశం బాగా కాంట్రవర్సీ కూడా అయింది. ఇదంతా పక్కన పెడితే భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర పరిస్థితి బాగా దారుణంగా ఉంది. ఈ చిత్రం విడుదలై 16 రోజులు గడుస్తోంది. 

Latest Videos

ఇప్పటి వరకు ఈ చిత్రం 190 కోట్ల వరకు నెట్ సాధించింది. గ్రాస్ లెక్క 300 కోట్ల వరకు ఉంది. 275 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో భారీ రేట్లకు అమ్మారు.  బయ్యర్లు కొన్న రేట్లు పక్కన పెడితే కనీసం నిర్మాత పెట్టిన 275 కోట్లు కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు 190 కోట్ల నెట్ మాత్రమే ఉంది. 

బుకింగ్స్ అంతకంతకూ పడిపోతూ వస్తున్నాయి. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లకు దారుణమైన నష్టాలు ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. హృతిక్ రోషన్ నుంచి ఈ తరహా చిత్రాన్ని ఆడియన్స్ కోరుకోరు. హృతిక్ మూవీ అంటే మాస్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ చిత్రంలో మాస్ ఉండడం కష్టం. గత ఏడాది పఠాన్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ఏడాది ఆరంభంలోనే పంచ్ పడింది. 

ఫైటర్ చిత్రం టాలీవుడ్ లో ఓ హీరోకి వార్నింగ్ బెల్ లాగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రంతో వస్తున్నాడు. మార్చి 1 న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి బజ్ కనిపించడం లేదు. ఫైటర్ చిత్ర పరిస్థితి గమనించి ముందుగా అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు. ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసి తమ చిత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించబోతోందో ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చెప్పాలి అని అంటున్నారు. వరుణ్ తేజ్, మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. 

click me!