దానయ్యకు పెద్ద దెబ్బే, రాజమౌళి ఒప్పుకోడుగా..

By Udayavani DhuliFirst Published Jan 18, 2019, 11:00 AM IST
Highlights

రాజమౌళి కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాడని చెప్తారు. కేవలం సినిమా మేకింగ్ విషయంలోనే కాదు ఆ సినిమా సంభందించిన మిగతా విషయాల్లోనూ ఆయన పాత్ర ఉంటుంది..

రాజమౌళి కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటాడని చెప్తారు. కేవలం సినిమా మేకింగ్ విషయంలోనే కాదు ఆ సినిమా సంభందించిన మిగతా విషయాల్లోనూ ఆయన పాత్ర ఉంటుంది..అందుకే ఆయన ఈ స్దాయి సక్సెస్ లో ఉన్నారు. అలాగే ఇప్పుడు దానయ్య నిర్మాతగా రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ కొన్ని విషయాలు ముందే మాట్లాడారని తెలుస్తోంది.

ఎటువంటి ఫైనాన్సియల్ కమిట్మెంట్స్ తన సినిమాతో కలపవద్దని, బిజినెస్ విషయాలు డిస్కస్ చేసుకుని ఫైనల్ చేద్దామని అన్నట్లు సమాచారం. అందులో తప్పేమి లేదు. అంత పెద్ద ప్రాజెక్టులు డీల్ చేసేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద సమస్యలో పడతారు. అయితే ఇప్పుడు ఆ కమిట్మెంటే నిర్మాత దానయ్య సమస్యలో తోసేసిందని సమాచారం. 

ఈ సంక్రాంతికి  దానయ్య ప్రతిష్టాత్మకంగా బోయపాటి-రామ్ చరణ్ కాంబోలో వినయ విధేయరామ ని విడుదల చేసారు. ఈ సినిమాకు ఆ కాంబినేషన్ నే పెద్ద ప్లస్ కావటంతో మంచి బిజినెస్ జరిగింది. అయితే ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ అయ్యింది. మొదట రోజు కలెక్షన్స్ స్టడీగా రెండో రోజు నుంచి డ్రాప్ అవటం మొదలెట్టాయి. దాంతో ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్ చెయ్యాల్సిన అవసరం ఉంది.

అయితే సాధారణంగా సినిమా ఫెయిల్యూర్ అయితే పెద్ద నిర్మాతలు ...తమ తదుపరి చిత్రం తక్కువ రేటుకు ఇచ్చి కాంపన్సేట్ చేస్తూంటారు. కానీ ఇక్కడ దానయ్య తదుపరి చిత్రం ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం...ఆ సినిమాతో లింక్ పెట్టుకుని వేరే సెటిల్మెంట్స్ చేయకూడదు. అంటే ఖచ్చితంగా డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందే.. ముఖ్యంగా యువి సంస్థ విక్రమ్ కు దాదాపు 15 కోట్లు వరకూ సెటిల్ చెయ్యాల్సిన అవసరం ఉందని,  సమాచారం. 

click me!