ట్రెండింగ్‌లో మోషన్‌ పోస్టర్‌.. వివాదంలో ఆచార్య.. చిరుకి తలనొప్పి

By Aithagoni RajuFirst Published Aug 24, 2020, 5:24 PM IST
Highlights

`సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

చిరంజీవి సినిమాలు ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఆయన రీఎంట్రీ ఇచ్చిన `ఖైదీ నెం.150` కూడా వివాదాల్లో చిక్కుకుంది. అది తమిళ చిత్రం `కత్తి`కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. నరసింహరావు అనే రైటర్‌, డైరెక్టర్‌ ఆ కథ నాదే అంటూ పెద్ద వివాదాన్ని సృష్టించారు. దాన్ని మొత్తానికి కొంత పరిహారం చెల్లించి సెటిల్‌ చేశారు. 

ఆ తర్వాత `సైరా నరసింహారెడ్డి` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఆ కథ విషయంలో, మరోవైపు సైరాని దొంగగా చూపించబోతున్నారంటూ కొంతమంది వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదంగానే మారింది. తాజాగా మరో వివాదం చిరంజీవిని వెంటాడబోతుంది. 

ఆచార్య కథపై ఓ రచయిత వివాదం సృష్టించారు. అది తమ కథ నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదలైన మోషన్‌ పోస్టర్‌ విడుదలైన సందడిచేస్తుంది. అయితే కన్నెగంటి అనిల్‌ కృష్ణ అనే రచయిత ఇది నా కథే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. `ఆచార్య` టైటిల్‌ తర్వాత వచ్చే సీన్‌ తాను రాసుకున్న సీన్‌లాగానే ఉందని ఆరోపిస్తున్నారు.  2006లో రైటర్స్ అసోసియేషన్‌లో `పుణ్యభూమి` అనే టైటిల్‌తో ఈ కథని రిజిస్టర్‌  చేయించినట్టుగా ఆయన తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఇదిలా ఉంటే ఆయన ఆరోపణల్లో నిజమెంతా అన్నది సస్పెన్స్ గా మారింది. జనరల్‌గా పెద్దగా పేరులేని రైటర్స్ ఇలాంటి వివాదాలు సృష్టిస్తే తమకి పేరు వస్తుందని, తమకి గుర్తింపు వస్తుందని భావించి ఇలాంటి వివాదాలకు పాల్పడుతుంటారు. మరి అనిల్‌ కృష్ణ అదే ఉద్దేశంతో చేస్తున్నాడా? లేక నిజంగానే ఆయన కథని కొరటాల కాపీ కొట్టారా? అన్నది మరింత సస్పెన్స్ గా మారింది. 

ఇదిలా ఉంటే చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదల చేసిన `ఆచార్య` మోషన్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో నెంబర్‌ వన్‌గా కొనసాగుతుంది. ఇందులో చిరు నక్సలిస్ట్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుండగా, రామ్‌చరణ్ కీలక పాత్ర పోషించనున్నారు. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. 

click me!