వీధిలో కుప్పుకూలిన వ్యక్తికి CPR చేసిన నటుడు, గుర్మీత్ చౌదరిని ఆకాశానికెత్తుతున్న నెటిజన్లు

By Mahesh Jujjuri  |  First Published Oct 6, 2023, 5:54 PM IST

రీల్ హీరో కాస్తా.. రియల్ హీరో అనిపించుకున్నాడు.. టెలివిజన్ రాముడు.. నిజంగా రాముడు మంచి బాలుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. హిందీ బుల్లితెర హీరో.. వీథిలో నిండు ప్రాణం కాపాడి రియల్ హీరో అయ్యాడు..


రీల్ హీరో కాస్తా.. రియల్ హీరో అనిపించుకున్నాడు.. టెలివిజన్ రాముడు.. నిజంగా రాముడు మంచి బాలుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. హిందీ బుల్లితెర హీరో.. వీథిలో నిండు ప్రాణం కాపాడి రియల్ హీరో అయ్యాడు..

 ప్రముఖ హిందీ నటుడు,  బుల్లితెర స్టార్ , టెలివిజన్‌ యాక్టర్‌ గుర్మీత్‌ చౌదరి (Gurmeet Choudhary) మంచి మనసు చాటుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సీపీఆర్‌ (CPR) అందించి అతడిని ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డాడు. అది కూడా తన షూటింట్ కు  సంబధించిన వ్యాక్తో.. లేక పోతే తెలిసిన వ్యాక్తి కూడా కాదు.. వీథిలో వెళ్తూ.. వెళ్తూ.. కుప్పకూలిన ఓ వ్యాక్తికి సీపిఆర్ చేశాడు. అంబులెన్స్ వచ్చేవరకూ వెయిట్ చేసి.. స్వయంగా అంబులెన్స్ లో ఎక్కించాడు.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Latest Videos

ముంబైలో  రోడ్డుపై ఓ వ్యక్తి కుప్పకూలిపోవడంతో స్థానికులు అతడిని లేపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అక్కడున్న గుర్మీత్‌ బాధితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. అతడికి సీపీఆర్‌ (Cardiopulmonary resuscitation) ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేశారు. ఈ  వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో.. నెటిజన్లు వెంటనే వెంటనే స్పందించారు.  గుర్మీత్‌ను బాగా  మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించిన గుర్మీత్‌ను రియల్‌ హీరో అంటూ కొనియాడుతున్నారు.

 

గుర్మీత్ చౌదరి బుల్లితెర స్టార్. ముఖ్యంగా రామాయణ్ టెలివిజన్ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇందులో రాముడి పాత్రలో చాలా హ్యాండ్సమ్ గా.. కనిపించి ఎంతో మంది అభిమానుల మననలు పొందాడు గుర్మీత్. ఇక ఇతను  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన లైఫ్‌కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల గుర్మీత్ భార్య దేవీనా బోనర్జీతో కలిసి గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

click me!