
చిరంజీవి-త్రిషలది హిట్ కాంబినేషన్. దాదాపు 14 ఏళ్ల అనంతరం తిరిగి నటిస్తున్నారు. 2006లో విడుదలైన స్టాలిన్ లో వీరు జతకట్టారు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన స్టాలిన్ మంచి విజయం సాధించింది. కాగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. త్రిష హీరోయిన్ గా ఎంపికైన నేపథ్యంలో ఆమె కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఆ మధ్య విశ్వంభర సెట్స్ లోకి త్రిషను చిరంజీవి స్వయంగా ఆహ్వానించాడు. చిరంజీవి-త్రిష కాంబినేషన్ మీద హైప్ నెలకొంది. కాగా చిరంజీవి భోళా శంకరుడు అన్న విషయం తెలిసిందే. తన తోటి నటులకు అప్పుడప్పుడు గిఫ్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. తాజాగా త్రిషకు ఓ బహుమతి ఇచ్చాడు చిరంజీవి, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసి మురిసిపోయింది త్రిష.
త్రిషకు చిరంజీవి మగ్ ఇచ్చారు. అందులో ప్రత్యేకత ఏముంది అంటే... అది సాధారణమైన మగ్ కాదు. త్రిష బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ త్రిష మురిసిపోయింది. ఆ బహుమతి విలువ, ప్రత్యేకతలు పక్కన పెడితే... చిరంజీవి వంటి లెజెండ్ గిఫ్ట్ ఇవ్వడం గొప్ప విషయం. అందుకే త్రిష తన అభిమానులతో ఈ విషయం పంచుకుంది. ఆ మధ్య నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయగా చిరంజీవి ఖండించారు. త్రిషకు మద్దతుగా నిలిచాడు.
ఇక విశ్వంభర విషయానికి వస్తే ఇది సోషియో ఫాంటసీ డ్రామా అని సమాచారం. చిరంజీవి సాహసవీరుడిగా మూడు లోకాల్లో సంచరిస్తాడట. త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విశ్వంభర చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.