షాక్‌: స్టార్ హీరోయిన్‌ తమన్నా తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్‌

Published : Aug 26, 2020, 03:04 PM ISTUpdated : Aug 26, 2020, 03:05 PM IST
షాక్‌: స్టార్ హీరోయిన్‌ తమన్నా తల్లి దండ్రులకు కరోనా పాజిటివ్‌

సారాంశం

తాజాగా మరో షాకింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా కలవరం సృష్టించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా ప్రకటించింది.

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అంతా కరోనా బారిన పడితున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా బాదితుల్లో ఉండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక రంగాన్ని ఈ మహమ్మారి తీవ్రంగా దెబ్బతీస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ తో పాటు ఆయన కుటుంబ మొత్తానికి కరోనా సోకటంతో ఒక్కసారి దేశం ఉలక్కిపడింది.

ఇక దక్షిణాదిలోనూ చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ కోలీవుడ్‌లలో పలువురు కరోనా బారిన పడగా లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృత్యువుతో పోరాడుతున్నారు. తాజాగా మరో షాకింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. స్టార్ హీరోయిన్ తమన్నా ఇంట్లోనూ కరోనా కలవరం సృష్టించింది. ఆమె తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా ప్రకటించింది.

`గత వారాంతంలో మా అమ్మా నాన్నలకు కొద్ది పాటి కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే ముందు జాగ్రత్తగా ఇంట్లో అంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవటంతో అమ్మానాన్నకు పాజిటివ్‌ అని తేలింది. వెంటనే అధికారులకు తెలియజేసి తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాం. దేవుడి దయ వల్ల నాతో సహా ఇంట్లో మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది` అంటూ ఓ సందేశాన్ని ట్వీట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?