సిల్క్ స్మిత కి ఎంత క్రేజ్ ఉందో చెప్పేందుకు ఈ సంఘటన ఒక నిదర్శనం. ఆమె సగం తిని వదిలేసిన ఆపిల్ ని వేలం వేస్తే హాట్ కేకులా అమ్ముడుపోయిందట. ధర ఎంత పలికింది అంటే?
సిల్వర్ స్క్రీన్ పై సిల్క్ స్మిత ఒక సంచలనం. కనీస చదువు, పరిజ్ఞానం లేని విజయలక్ష్మి వడ్లపాటి నటిగా ఎదిగిన తీరు అద్భుతం. పేదరికం కారణంగా చిన్న వయసులోనే విజయలక్ష్మికి వివాహం చేశారు. అత్తింటివారి వేధింపులు తట్టుకోలేక చెన్నై పారిపోయింది. ఒక్కో విషయం నేర్చుకుంటూ నటిగా, డాన్సర్ గా ఎదిగింది. కెరీర్ బిగినింగ్ లో మలయాళ చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత అనంతరం తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాల్లో సైతం నటించింది. హిందీలో కొన్ని చిత్రాలు చేసింది.
రెండోతరం ఐటెం భామగా సిల్క్ స్మిత సిల్వర్ స్క్రీన్ ని ఏలింది. జ్యోతి లక్ష్మి, జయలక్ష్మి వంటి డాన్సర్స్ ని బీట్ చేసింది. సిల్క్ స్మితలో ఒక తెలియని ఆకర్షణ ఉండేది. శృంగార దేవతగా ఆమెను అప్పటి కుర్రాళ్ళు ఆరాధించారు. వందల చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత విలక్షణ పాత్రలు చేసింది. ఆమె కామెడీ, సీరియస్, ఎమోషనల్, విలన్ పాత్రల్లో కనిపించారు. పదుల సంఖ్యలో స్పెషల్ సాంగ్స్ చేసింది.
అప్పట్లో సిల్క్ స్మిత క్రేజ్ ఏమిటో చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనం. సిల్క్ స్మిత ఎంగిలి చేసిన ఆపిల్ ని వేలం వేశారట. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారట. ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా... షాట్ గ్యాప్ లో సిల్క్ స్మిత ఆపిల్ తినడం ఆరంభించిందట. ఒక ముక్క కొరికిన వెంటనే, షాట్ రెడీ అన్నారట. దాంతో తింటున్న ఆపిల్ పక్కన పెట్టేసి సిల్క్ స్మిత కెమెరా ముందుకు వెళ్లిపోయిందట. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆ ఆపిల్ ని తీసుకున్నాడట.
సిల్క్ స్మిత ఎంగిలి చేసిన ఆపిల్ అంటూ దాన్ని వేలం వేశాడట. ఆ ఆపిల్ ని కొనేందుకు ఎగబడ్డారట. సిల్క్ స్మిత సగం తిన్న ఆ ఆపిల్ ని వేలంలో ఎంతకు కొన్నారనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. రూ. 2 లక్షలు పలికిందని కొందరు అంటారు. లేదు రూ. 1 లక్షకు కొన్నారని మరొకరి వాదన. కేవలం రూ. 200 మాత్రమే పలికింది అనేది మరొక వాదన. రూ. 25000 వేలు అంటూ మరికొందరు అంటుంటారు.
ఎంతకు కొన్నారనే విషయం పక్కన పెడితే సిల్క్ స్మిత క్రేజ్ కి ఈ ఘటన కొలమానంగా నిలిచింది. మంచి భవిష్యత్ ఉన్న సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి సిల్క్ స్మిత వయసు 35 ఏళ్ళు మాత్రమే. ప్రేమలో మోసపోయిన సిల్క్ స్మిత ఒంటరితనంతో కృంగిపోయింది. సూసైడ్ నోట్ లో సిల్క్ స్మిత కీలక విషయాలు వెల్లడించింది. వందల చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేదు. ఒక అనాథగా ఆమె వెళ్లిపోయారు..