ఇవన్నీ పుష్ప 2 కు నార్త్ భాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదలై మూడేళ్లు గడుస్తోంది. అయినా ఎక్కడా కొంచెం కూడా క్రేజ్ తగ్గలేదు. రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది. ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2: ది రూల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకు ఆలస్యమవుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా విడుదలయ్యేది. అయితే ఈ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 6 కి మార్చారు. అయితే ఇప్పుడా తేదీకి మరో సినిమా నార్త్ లో రిలీజ్ అవుతూండటంతో కలెక్షన్స్ వైజ్ గా దెబ్బ పడుతుందని ట్రేడ్ భావిస్తోంది. ఇంతకీ ఏం సినిమా అదీ అంటే...
ఆ సినమా పేరు 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోందీ చిత్రం. 'మిమి', 'చుప్పి' ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఇది రూపొందుతోంది. సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో కనిపిస్తోంది రష్మిక. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ రిలీజ్ తో పాటే డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.
ఈ టీజర్ లో వందలాది మంది శత్రువులతో పోరాడే యుద్ధ వీరుడు సాంబాజీగా తన నట విశ్వరూపం చూపించారు విక్కీ కౌశాల్. అలాగే రష్మిక మందన్నా కూడా ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే ఛావా రిలీజ్ రోజునే(డిసెంబర్ 6) అల్లు అర్జున్ - రష్మిక కలిసి నటించిన పుష్ప 2(Pushupa 2 VS Chava) కూడా థియేటర్లలో విడుదల కానుంది. దీనిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్‌లో ఫుల్ హైప్ ఉంది. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు మరో టఫ్ ఫైట్ రెడీ అవుతోంది.
ఫైట్ వరకూ బాగానే ఉన్నా మహారాష్ట్ర, ముంబై బెల్ట్ లలో ఛత్రపతి శివాజీని ఇప్పటికీ దేవుడులా కొలుస్తారు. అక్కడ వారికి శివాజీ సెంటిమెంట్, దాంతో మొదటి ఓపినింగ్స్ ఆ సినిమాకే ఎక్కువ వచ్చే అవకాసం ఉందంటున్నారు. సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా మహారాష్ట్ర బెల్ట్ మొత్తం ముంబైతో సహా ఈ సినిమా చూడటానికే ప్రయారిటీ ఇస్తారు. దానికి తోడు ఈ సినిమా టీజర్ భారీ యాక్షన్ తో నిండి ఉంటుందని చెప్పింది. ఇవన్నీ పుష్ప 2 కు నార్త్ భాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పెడతాయని అంటున్నారు.
అలాగని పుష్ప 2 వాయిదా వేసే పరిస్దితి లేదు. డిసెంబర్ 6 రిలీజ్ డేట్ కనుక వదిలేస్తే ఇబ్బందే. ఎందుకంటే జనవరి సంక్రాంతికి థియేటర్ లోకి వచ్చే సినిమాలు ఫిక్స్ అయ్యిపోయాయి. వాళ్లెవరూ తగ్గరు. తర్వాత వచ్చే ఫిబ్రవరి లో కలెక్షన్స్ ఉండవు. దాంతో వేసవికి ప్లాన్ చేసుకోవాలి. అలాంటి మార్పులు ఓటిటి సంస్దలు వాళ్లు ఒప్పుకోరు. కాబట్టి పుష్ప 2 ఎట్టి పరిస్దితుల్లోనూ డిసెంబర్ 6 కే వచ్చేస్తుంది.