పుష్ప 2లోకి సీక్రేట్ గా సాయి పల్లవిని తీసుకున్న సుకుమర్, అల్లు అర్జున్ జోడీగానా..?

Published : Mar 08, 2023, 02:06 PM IST
పుష్ప 2లోకి  సీక్రేట్ గా  సాయి పల్లవిని తీసుకున్న సుకుమర్,  అల్లు అర్జున్ జోడీగానా..?

సారాంశం

సాధారణంగా అన్ని సినిమాలు ఒప్పుకోదు. ఆమె ఒప్పుకుందీ అంటే ఆ సినిమా లో పాత్రలగురించి.. సినిమాగురించి పెద్ద రీసెర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటీవ్ జీనియ‌స్‌ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ హిట్ మూవీ  పుష్ప ది రైజ్. 2021 డిసెంబ‌ర్‌లో రిలీజ్ అయిన ఈసినిమా పాన్ ఇండియ రేంజ్ లో  రచ్చ రచ్చ చేసింది.  బాక్సాఫీస్‌ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్  సాధించి అల్లుఅర్జున్‌కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకువచ్చింది.  బాలీవుడ్ లో ఊహించని విధంగా ఎటువంటి ప్రమోషన్ లేకుండా దూసుకుపోయింది. అంతే కాదు   ఒక్క బాలీవుడ్ లోనే 100 కోట్ల నెట్ సాధించి అక్క‌డి క్రిటిక్స్ ను కూడా వశేషంగా ఆకట్టుకుంది సినిమా.  విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. 

ఇక ఈ సినిమా కు ప్రస్తుతం  సీక్వెల్‌ రెడీ చేసేపనిలో ఉన్నారు టీమ్. పుష్ప మ్యానియాలో పడ్డ ఇండియా మొత్తం.. పుష్ప2 కోసం  ఎదురు చూస్తుంది. రీసెంట్ గా  ఇప్పటికే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. అయితే పుష్ప2 కుసబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఈసినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్.. మరికొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి అయితే ఈసినిమాకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

షాకింగ్ న్యూస్ ఏంటంటే..  పుష్ప సీక్వెల్  సినిమాలో సాయిపల్లవి కీలకపాత్రలో నటిస్తున్నట్టు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. ఓ గిరిజన అమ్మాయి పాత్ర కోసం సాయిపల్లవిని పుష్ప మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈపాత్ర చేయడం కోసం సాయిపల్లవి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే..? ఈ సినిమా కోసం సాయిపల్లవి 10రోజులు కాల్షీట్లు కూడా ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.  కాని ఇప్పటి వరకూ ఈ న్యస్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. 

ఎర్రచందనం స్మగ్లింగ్‌ కాన్సెప్ట్ తో  తెరకెక్కిన పుష్ప మూవీ రిలీజైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్  సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ జంటగా కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ పుష్ప పార్ట 1 లో చివరిగా కనిపించారు. పుష్ప పార్ట్ 2ను ఆయనే లీడ్ చేయబోతున్నారు.

 పుష్ప సనిమాలో బన్నీ యాక్టింగ్,  డైలాగ్స్, మేనరిజమ్స్ , సాంగ్స్... ఒక్క ఇండియాను మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. సినీ సెల‌బ్రెటీల నుండి క్రికెట‌ర్స్‌, రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఈ సినిమా డైలాగ్స్‌, హూక్ స్టెప్స్‌ను రీల్స్‌గా చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప అఖండ విజయం సాధించింది. బన్నీని ప్యాన్ ఇండియా స్టార్ని చేసింది. ఇప్పుడు పుష్ప సీక్వెల్ పనుల్లో ఇద్దరూ బిజీగా ఉన్నారు. తొలి పార్టు సక్సెస్ ను దృష్టిలో ఉంచుకొని రెండో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?