ప్రశ్నిస్తే ఇలాంటివి కోరుకునే కదా వృత్తిలోకి వచ్చావని అంటున్నారు!

By Sambi Reddy  |  First Published Feb 5, 2024, 11:11 AM IST

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. మరోసారి డీప్ ఫేక్ వీడియోపై ఆమె స్పందించారు. 
 


డీప్ ఫేక్ వీడియోలు సెలెబ్స్ ని చెమటలు పట్టిస్తున్నాయి. రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియోను స్వయంగా అమితాబ్ బచ్చన్ షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు సత్వరమే దృష్టి పెట్టాల్సిన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అనే యువతి వీడియోను రష్మిక ముఖంతో డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది ఒరిజినల్ వీడియో అని పలువురు రష్మిక మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో పై కేసు నమోదు చేసిన పోలీసులు నెలల తరబడి విచారణ జరిపారు. ఇటీవల గుంటూరుకు చెందిన ఒక యువకుడిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రష్మిక మందానతో పాటు కాజోల్, ప్రియాంక చోప్రా, అలియా భట్, నోరా ఫతేహి ఇలా పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Latest Videos

దీనిపై రష్మిక మందాన తాజాగా మరోసారి స్పందించారు. ఆమె మాట్లాడుతూ... దీన్ని ప్రశ్నిస్తే ఇలాంటివి కోరుకునే కదా ఈ వృత్తిలోకి వచ్చారని అంటున్నారు. ఇదే పరిస్థితి మరో అమ్మాయికి ఎదురైతే పరిస్థితి ఏంటీ? ఈ రోజుల్లో అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. నా లాంటి వాళ్ళు డీప్ ఫేక్ వీడియోల గురించి మాట్లాడితే కొందరు మహిళల్లో అయినా అవగాహన వస్తుంది. అమ్మాయిలకు దీని గురించి తెలియజేయాలి, అన్నారు. 

రష్మిక మందాన యానిమల్ మూవీతో భారీ హిట్ కొట్టింది. యానిమల్ రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెక్స్ట్ రష్మిక మందాన అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2లో కనిపించనుంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 
 

click me!