తాగేసి హోటల్ లో హీరోయిన్ రచ్చ!

Published : May 12, 2018, 01:27 PM IST
తాగేసి హోటల్ లో హీరోయిన్ రచ్చ!

సారాంశం

సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతుంటుంది

సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతుంటుంది. అందుకే తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా.. ఒక్కోసారి అవి బయటపడుతూనే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ తాగి హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన హాట్ గ్లామర్ అవతారంతో యువతను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత సెలెక్టెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించింది.

బంజారాహిల్స్ లో ఓ స్టార్ హోటల్ లో ఉంటోన్న ఈ భామ సీనియర్ హీరో ఇచ్చిన ఒక పార్టీకు వెళ్లి ఫుల్లుగా మద్యం సేవించి అర్ధరాత్రి హోటల్ కు చేరింది. అయితే అక్కడ కూడా తనకు మందు కావాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. బార్ కౌంటర్ క్లోజ్ అయిందని చెప్పినా ఆమె వినలేదు. తను చెప్పింది చేయలేదని మేనేజర్ ను నోటికొచ్చినట్లు తిట్టిన ఈ హీరోయిన్ తన ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి బార్ కౌంటర్ తెరిచేలా చేసిందట. 

ఆమెను కంట్రోల్ చేయడానికి హోటల్ సిబ్బందికి మూడు గంటలు పైనే పట్టిందట. మొత్తానికి ఈ బ్యూటీ తాగేసి చేసిన రచ్చతో అవ్వాక్కవ్వడం హోటల్ యాజమాన్యంవంతైంది.    

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్