పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ వీడియో లీక్... ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ!

Published : Aug 26, 2023, 03:11 PM ISTUpdated : Aug 26, 2023, 03:15 PM IST
పబ్ లో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ వీడియో లీక్... ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ!

సారాంశం

హీరోయిన్ కీర్తి సురేష్ పబ్ లో డాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయింది. ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటూ ఆమె చిల్ అవుతున్నారు.   

కీర్తి సురేష్ కెరీర్ పీక్స్ లో ఉండగా వరుస చిత్రాలతో  ఫుల్ బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ భోళా శంకర్. చిరంజీవి చెల్లెలు పాత్ర చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ కావడం ఒకింత ఆమెను నిరాశపరిచింది. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ కాదు. అలాగే నెగిటివిటీ అంతా చిరంజీవి, మెహర్ రమేష్ మీద కొట్టుకుపోయింది. నెక్స్ట్ నాగ చైతన్యతో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. ఆయన అప్ కమింగ్ చిత్రానికి సైన్ చేసిందట. కెరీర్లో ఫస్ట్ టైం నాగ చైతన్య-కీర్తి సురేష్ కలిసి చిత్రం చేస్తున్నారు. మహానటి చిత్రంలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేశారంతే... 

అన్ని భాషల్లో కలిపి ఐదారు చిత్రాల వరకూ కీర్తి సురేష్ చేస్తున్నారు. ఆ మధ్య కీర్తి సురేష్ పెళ్లి వార్తలు హల్చల్ చేశాయి. నటులు, ఆమె స్నేహితులు పేర్లు తెరపైకి వచ్చాయి. కీర్తి సురేష్ పెళ్లి వార్తలను ఆమె పేరెంట్స్ ఖండించారు. ఇవన్నీ పుకార్లు మాత్రమే. కీర్తికి పెళ్లి కుదిరినప్పుడు మేమే ఖచ్చితంగా చెబుతామని వెల్లడించారు. 

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఫ్రెండ్స్ తో డాన్స్ చేస్తూ ఆమె ఫుల్ గా చిల్ అవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండే కీర్తి విరామం దొరకడంతో మిత్రులతో అలా ఎంజాయ్ చేశారని తెలుస్తుంది. సోషల్ మాధ్యమాల్లో కీర్తి సురేష్ పబ్ వీడియో హల్చల్ చేస్తుంది. 

 

తెలుగులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం దసరా. నాని హీరోగా నటించాడు. వంద కోట్లకు పైగా వసూళ్లతో దసరా దుమ్మురేపింది. అలాగే మహేష్ కి జంటగా నటించిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇటీవల తమిళ చిత్రం మామన్నన్ మూవీతో పలకరించింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్