హీరోయిన్ దీపికా పదుకొనేకు తీవ్ర అస్వస్థత... ఆందోళనలో ఫ్యాన్స్!

Published : Sep 28, 2022, 11:50 AM IST
హీరోయిన్ దీపికా పదుకొనేకు తీవ్ర అస్వస్థత... ఆందోళనలో ఫ్యాన్స్!

సారాంశం

హీరోయిన్ దీపికా అనారోగ్యానికి గురయ్యారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీపికా తరచుగా అనారోగ్యం బారిన పడడం ఆమె ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది.   

సోమవారం దీపికా పదుకొనె తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. దీంతో సిబ్బంది ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారట. చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారట. బాలీవుడ్ మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించడం హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్లుగా దీపికా పదుకొనె మానసిక వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ రుగ్మతకు ఆమె చికిత్స తీసుకుంటున్నారు. ఆ మధ్య ప్రాజెక్ట్ కే సెట్స్ లో దీపికా పదుకొనె ఒత్తిడి తట్టుకోలేక కూలబడిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

దీపికా ఆరోగ్య సమస్యలు ప్రాజెక్ట్ కే యూనిట్ కి ఇబ్బందిగా మారాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను నిర్మాత అశ్వినీ దత్ ఖండించారు. దీపికా మానసిక వ్యాధితో బాధపడుతున్నారన్న వార్తల్లో నిజం లేదు. బీపీ ప్రాబ్లెమ్ తో దీపికా ఆసుపత్రిలో చేరారంటూ చెప్పుకొచ్చారు. అయితే అశ్వినీ దత్ స్టేట్మెంట్ ని ఎవరూ విశ్వసించలేదు. దీపికా హీరో రన్బీర్ కపూర్ ని ఘాడంగా ప్రేమించారు. కొన్నాళ్ల రిలేషన్ తర్వాత దీపికాతో రన్బీర్ విడిపోయారు. ఆ సమయంలో దీపికా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఒకటి రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లు సమాచారం. 

అనంతరం రణ్వీర్ సింగ్ ని వివాహం చేసుకున్నారు. రణ్వీర్ తో వివాహం తర్వాత కూడా దీపికా డిప్రెషన్ నుండి బయటపడలేదని వినికిడి. ఇక దీపికా ఆరోగ్య సమస్యలు ప్రాజెక్ట్ కే కి ఇబ్బందిగా తయారయ్యే సూచనలు కలవు. రూ. 500 కోట్ల ఈ భారీ పాన్ ఇండియా మూవీ దీపికా కారణంగా సమస్యలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా.. అమితాబ్, దిశా పటాని కీలక రోల్స్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే చిత్రంతో పాటు షారుక్ ఖాన్ కి జంటగా జవాన్, పఠాన్ చిత్రాల్లో దీపికా హీరోయిన్ గా నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anirudh Kavya Marriage: అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి నిజమేనా? ఈ ఏడాదిలోనే ఒక్కటవ్వబోతున్నారా?
Rakul Preet Singh: 7 దేశీ లుక్స్‌లో అదరగొట్టిన రకుల్.. అచ్చమైన ఇండియన్ బ్యూటీ ఎలా ఉందంటే?