వైరల్ అవుతోన్న హీరోయిన్ కూతురు ఫోటో!

Published : Sep 12, 2019, 10:44 AM IST
వైరల్ అవుతోన్న హీరోయిన్ కూతురు ఫోటో!

సారాంశం

ఓనం పండగ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పటి క్రేజీ కథానాయకి అసిన్‌ గారాల బిడ్డ. పేరు హారిణి.   

ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది నటి అసిన్. అలా అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే మైక్రోమాక్స్‌ సంస్థ అధినేత రాహుల్‌ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2015లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

పెళ్లైన రెండేళ్లకు 2017లో అక్టోబర్ 24న అసిన్ ఓ పాపకు జన్మనిచ్చింది. తన కూతురికి హరిణి అని పేరు పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది అసిన్.

తాజాగా ఓనం పండగ సందర్భంగా చిరునవ్వులు చిందిస్తోన్న తన కూతురు ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో గతేడాది ఓనం  సందర్భంగా తీసిందని క్యాప్షన్ ఇచ్చింది అసిన్.

 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే