బాలకృష్ణతో పోరాడబోతున్న అంజలి, ఒకప్పుడు బాలయ్య హీరోయిన్, ఇప్పుడు విలన్..?

By Mahesh Jujjuri  |  First Published Jun 6, 2022, 2:31 PM IST

ఆమధ్య బాలయ్య సినిమాలో హీరోయిన్ గా అలరించింది అంజలి, ప్రస్తుతం బాలకృష్ణకు విలన్ గా మారబోతోంది. ఇంతకీ ఏ సినిమాలో అంజలీ నెగెటీవ్ రోల్ చేయబోతోంది..? 


తెలుగు .. తమిళ భాషల్లో అంజలికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు నుంచి కూడా ఆమె ఖాతాలో హిట్ సినిమాలు ఉన్నాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా ఆడియన్స్ ను అలరించింది అంజలి. ఏ పాత్ర అయినా  సమర్థవంతంగా పోషించగలననే విషయాన్ని ఆమె నిరూపించుకుంది. అయితే, ఈ మధ్య  కాలంలో అంజలికి సరైన అవకాశాలు లేవు .. తన స్థాయికి తగిన పాత్రలూ పడలేదు.

నిశ్శబ్దం, వకీల్ సాబ్  సినిమాల తరువాత అంజలి తెలుగులో  ఏ సినిమాలు చేయలేదు. తాజాగా అంజలి తెలుగు సినిమా పై క్రేజీ రూమర్ వినిపిస్తోంది. బాలకృష్ణ సినిమా కోసం ఆమె పేరు ముఖ్యంగా  వినిపిస్తోంది. బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి అనిల్ రావిపూడి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగుతుందని తాజా ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు. 

Latest Videos

ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని ఆయనే చెప్పాడు. ఇక  హీరోయిన్ గా మెహ్రీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా...ప్రియమణి కూడా లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు తాజాగా అంజలి పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అంజలి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించనుందనే టాక్ వినిపిస్తోంది.  గతంలో బాలయ్య సరసన డిక్టేటర్ సినిమాలో అంజలి నటించింది.  తరువాత బాలయ్యతో ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే... అఫీషియల్ ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే..

click me!