అందవిహీనంగా ఉన్నావన్న అభిమానికి హీరోయిన్ అదిరిపోయే రిప్లై

Published : Aug 18, 2020, 01:44 PM ISTUpdated : Aug 18, 2020, 01:48 PM IST
అందవిహీనంగా ఉన్నావన్న అభిమానికి హీరోయిన్ అదిరిపోయే రిప్లై

సారాంశం

సోషల్ మీడియా యుగంలో ఎవరు మనసులో  ఏదనుకున్నా టక్కున కామెంట్ రూపంలో కక్కేస్తున్నారు. ఇక సెలెబ్రిటీలను ఫాలో అయ్యే నెటిజెన్స్ కామెంట్స్ అనేక సార్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ ఫోటోపై ఓ నెటిజెన్ చేసిన కామెంట్ ఆసక్తి రేపుతోంది.   

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారి ప్రతి విషయంపై ప్రజల దృష్టి ఉంటుంది. వారు వేసుకొనే బట్టలు, వాడే కార్లు, బంధాలు, సంబంధాలు వంటి విషయాలపై అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. ఇక సోషల్ మీడియా విప్లవం తరువాత నెటిజెన్స్ హీరో లేదా హీరోయిన్స్ లుక్ పై వెంటనే తమ ఫీలింగ్స్ చెప్పేస్తున్నారు. అందుకే తారలు బయటికి రావాలంటే అనేక జాగ్రతలు తీసుకుంటారు . అలాగే సోషల్ మీడియాలో వారు పంచుకొనే ఫోటోలు విమర్శల పాలు కాకుండా చూసుకుంటారు. సాధ్యమైనంత వరకు అందంగా కనిపించేలా చూసుకుంటారు. 

దీనికి భిన్నంగా బెంగాలీ నటి స్వస్తికా ముఖర్జీ చిత్రమైన ఫోటో సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె అరగుండు తో ఓ ఫోటోకి పోజిచ్చారు. ఓ ప్రక్క సెమి షేవ్ చేసిన తలతో ఉన్న ఆమె మరో ప్రక్క పూర్తి జుట్టుతో కనిపించారు. దీనితో ఆమె ఫోటోపై నెటిజన్స్ భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. వారిలో ఓ నెటిజెన్ ' మీ హెయిర్ స్టయిల్ నాకు నచ్చింది, ఐతే మీరు కాదు. కనీసం ఫిల్టర్స్ కూడా వాడకుండా ఉన్న మేకప్ లేని మీ ముఖం నచ్చలేదు' అని కామెంట్ చేశాడు. 

దీనికి సదరు నటి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. అవునా. అందవిహీనంగా కనిపించడం కూడా సంతోషం కలింగించే అంశమే అన్నారు. దానికి  ఆ నెటిజెన్ నేను ఆ అర్థంతో అనలేదని కొంచెం పశ్చాత్తాపపడ్డారు. ఇక ఇటీవల విడుదలై భారీ ఆదరణ దక్కించుకున్న సుశాంత్ చివరి చిత్రం దిల్ బేచారా మూవీలో, స్వస్తికా ముఖర్జీ ఓ కీలక రోల్ చేశారు. అలాగే ఆమె నటించిన బెంగాలీ చిత్రం తాషెర్ ఘావర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పాతాళ్ లోక్ సిరీస్ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే