వ్యవసాయం చేస్తున్న రష్మిక మందాన, వైరల్ అవుతున్న వీడియో

Published : Mar 18, 2021, 03:20 PM IST
వ్యవసాయం చేస్తున్న రష్మిక మందాన, వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

 రైతుగా పొలంలో పనిచేస్తున్న రష్మిక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు సడన్ గా రష్మికకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు.   

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన రైతుగా మారిపోయారు. ఆమె చొక్కా వేసుకొని, నడుము బిగించి... పొలంలో మోకాళ్ళ లోతు బురదలో పని చేస్తూ కనిపించారు. రైతుగా పొలంలో పనిచేస్తున్న రష్మిక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు సడన్ గా రష్మికకు వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. 

అయితే రష్మిక పొలంలో పనిచేస్తున్న ఆ వీడియో ఇప్పటిది కాదని సమాచారం. కార్తీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సుల్తాన్. విడుదలకు సిద్ధంగా ఉన్న సుల్తాన్ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో రష్మిక... పక్కనే ఉన్న పొలాల్లో పని చేస్తూ కెమెరాకు పోజిచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది. అయితే రైతుగా రష్మిక లుక్ ఆసక్తికరంగా ఉంది. 


టాప్ హీరోయిన్ గా సౌత్ లో దూసుకుపోతున్న రష్మీ బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు. మిషన్ మజ్ను పేరుతో తెరకెక్కుతున్న హిందీ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. ఇక తెలుగులో భారీ చిత్రం పుష్ప లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రంగా వస్తుండగా... పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే