Vijay Devarakonda: ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ ఊహించని క్రిస్మస్ గిఫ్ట్..!

Published : Dec 27, 2022, 08:07 AM ISTUpdated : Dec 27, 2022, 08:15 AM IST
Vijay Devarakonda: ఫ్యాన్స్ కి విజయ్ దేవరకొండ ఊహించని క్రిస్మస్ గిఫ్ట్..!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. క్రిస్మస్ కానుకగా వంద మంది అభిమానులకు హాలిడే ట్రిప్ స్పాన్సర్ చేశారు. 


రౌడీ హీరో ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. యాటిట్యూడ్ గా బాప్ అనిపించే విజయ్ దేవరకొండలో సోషల్ రెస్పాన్సిబిలిటీ యాంగిల్ కూడా ఉంది. కరోనా సమయంలో విజయ్ దేవరకొండ ఒక టీమ్ ని ఫార్మ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఆహార అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందిపడుతున్న పేదలకు సహాయం చేశారు. రిక్వెస్ట్స్ ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కిరాణా సామానులు ఏర్పాటు చేశారు. వేలల్లో విజయ్ దేవరకొండ టీమ్ సహాయం చేసినట్లు సమాచారం. 

ఇక ప్రతి ఏడాది క్రిస్మస్ కి దేవరశాంటా అనే ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం తన అభిమానులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. ఒక పోల్ నిర్వహించిన విజయ్ దేవరకొండ అందులో పాల్గొన్న అభిమానుల నుండి వంద లక్కీ పార్టిసిపెంట్స్ ని ఎంపిక చేసి, తన సొంత ఖర్చులతో ఇండియాలో కోరుకున్న ప్రదేశాన్ని సందర్శించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

'నేను గత ఐదేళ్లుగా దేవరశాంటా(#Devarasanta) సంప్రదాయం కొనసాగిస్తున్నాను. ఈ ఏడాది నాకు ఒక చక్కని ఐడియా వచ్చింది. నేను ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నాను. ఎలాంటి ప్రాంతాన్ని సందర్శించాలో మీరు సూచించాలి. ఈ పోల్ నందు పాల్గొన్న వారిలో 100 మందిని ఉచితంగా దేశంలో నచ్చిన ప్రదేశాన్ని సందర్శించే ఏర్పాటు చేస్తాను' అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ఈ పోల్ కి విశేష స్పందన దక్కింది. 31 వేలకు పైగా పోల్ లో పాల్గొన్నారు. 

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తన ట్రావెలింగ్ ఆప్షన్స్ గా మౌంటైన్స్, సముద్రాలు, ఎడారులు, సాంస్కృతిక ప్రదేశాలు పెట్టారు. వీటిలో మెజారిటీ ఫ్యాన్స్ మౌంటైన్స్ కి ఓటు వేశారు. అత్యధికంగా 42.5% మంది మౌంటైన్స్ బెటర్ ట్రావెలింగ్ డెస్టినేషన్ గా ఎంచుకున్నారు. ఇక ఈ పోల్ లో పాల్గొన్న వారిలో వంద మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. తన ఖర్చులతో దేశంలో వారు కోరుకున్న ప్రదేశానికి విజయ్ దేవరకొండ ట్రిప్ కి పంపుతారు. ఇది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్(Christmas Gift)గా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇక ఈ ఏడాది విజయ్ దేవరకొండకు కలిసి రాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ పరాజయం కాగా... మొదలైన జనగణమన మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Arijit Singh Telugu Songs: స్టార్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ పాడిన తెలుగు హార్ట్ టచ్చింగ్‌ సాంగ్స్ ఇవే
BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌