దమ్ము, రామారావు రెండూ పోయాయి.. బోయపాటి కథ చెప్పకుండా, అసలు ఒప్పుకునే వాడినే కాదు.. హీరో వేణు

Published : Oct 01, 2023, 09:01 PM IST
దమ్ము, రామారావు రెండూ పోయాయి.. బోయపాటి కథ చెప్పకుండా, అసలు ఒప్పుకునే వాడినే కాదు.. హీరో వేణు

సారాంశం

హీరో వేణు పేరు చెప్పగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం చూడగలిగే కుటుంబ కథా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఈ ఆరడుగుల హీరో సెంటిమెంట్ తో కూడా కన్నీళ్లు తెప్పించాడు.

హీరో వేణు పేరు చెప్పగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం చూడగలిగే కుటుంబ కథా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఈ ఆరడుగుల హీరో సెంటిమెంట్ తో కూడా కన్నీళ్లు తెప్పించాడు. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. 

  ఇటీవల ఒకటి అరా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తప్ప వేణు హీరోగా నటించడం లేదు. వేణు నటించిన అతిథి వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతూ మంచిరెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో వేణు పాల్గొంటున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో వేణు.. తాను క్యారెక్టర్ రోల్స్ చేసిన ఎన్టీఆర్ దమ్ము, రవితేజ రామారావు చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

అప్పటికి హీరోగా ఫేడ్ అవుట్ అయిన వేణు క్యారెక్టర్ రోల్స్ తో మెప్పించాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో చిన్న పాత్రలో మెరిశాడు. దమ్ము చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఆయా చిత్రం గురించి వేణు మాట్లాడుతూ బోయపాటి గారు నాకు కథ చెప్పలేదు. షోలే లో అమితాబ్ లాంటి పాత్ర అని చెప్పారు. 

కథ తెలిసుంటే మాత్రం ఆ చిత్రం చేసేవాడిని కాదు. అలాగే రీసెంట్ గా నటించిన రామారావు చిత్రం కూడా ఫ్లాప్ అయింది. ఇకపై కథ విన్న తర్వాతే ఎలాంటి పాత్రకైనా ఓకె చెబుతాను అని వేణు తొట్టెంపూడి అన్నారు.   

PREV
click me!

Recommended Stories

Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం