సైంధవ్ ట్రైలర్... వెంకీ యాక్షన్ అవతార్, గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్!

By Sambi ReddyFirst Published Jan 3, 2024, 11:58 AM IST
Highlights

సైంధవ్ తో సంక్రాంతి సమరానికి సిద్ధం అవుతున్నాడు వెంకటేష్. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. సైంధవ్  ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 
 

వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల వెంకీ 75 ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. కాగా నేడు సైంధవ్ ట్రైలర్ విడుదల చేశారు. మూడున్నర నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. 

వెంకటేష్ ఓ ఏడేళ్ల పాప తండ్రిగా కనిపిస్తున్నాడు. అరుదైన వ్యాధి బారిన పడిన ఆ పాపను కాపాడుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన మెడిసిన్ కావాలి. మిడిల్ క్లాస్ తండ్రి అంత డబ్బు ఎక్కడ నుండి తేగలడు? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అనేది చిత్ర కథ. ఫ్యామిలీ ఎమోషన్స్, మాఫియా యాక్షన్ కలగలిపి సైంధవ్ తెరకెక్కింది. అసలు వెంకీ మాఫియాతో ఎందుకు పెట్టుకున్నాడు? అనే అంశం ఆసక్తి రేపుతోంది. 

Latest Videos

ఈ మధ్య కాలంలో వెంకటేష్ నుండి ఈ రేంజ్ యాక్షన్ చూడలేదు. ఆయన డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో భారీ క్యాస్ట్ నటించారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఫస్ట్ టైం టాలీవుడ్ లో చిత్రం చేస్తున్నారు. కోలీవుడ్ ఆర్య, శ్రద్దా శ్రీనాధ్, జిషు సేన్ గుప్త... ఇలా భారీ తారాగణంతో సైంధవ్ తెరకెక్కింది. 

సైంధవ్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. 75వ వెంకీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే ఆస్కారం ఉంది. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. 
 

click me!