సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Published : Jul 13, 2021, 09:12 AM IST
సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

సారాంశం

ఇటీవల `మోసగాళ్లు` చిత్రంతో తెలుగులో మెరిసిన బాలీవుడ్‌ హీరో సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. 

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి అపార్ట్ మెంట్‌ సీజ్‌కి గురయ్యింది. ముంబయి మున్సిపల్‌ (బీఎంసీ) అధికారులు సీజ్‌ చేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ముంబయి, మౌంట్‌ రోడ్‌లోని పృథ్వీ అపార్ట్ మెంట్స్ లోని 18వ ఫ్లోర్‌లో సునీల్‌ శెట్టి నివసిస్తున్నారు. అక్కడ కరోనా కేసులు పెరగడంతో ఆ అపార్ట్ మెంట్‌ మొత్తాన్ని సీజ్‌ చేసినట్టు బీఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రశాంత్‌ గైక్వాడ్‌  వెల్లడించారు. 

`కేసుల విస్తరణను అడ్డుకునే క్రమంలో ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, భవనం మొత్తం మోహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే సునీల్‌ శెట్టి, ఆయన కుటుంబం మొత్తం ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. కొన్ని రోజులు ఈ నిర్భందం తప్పదని వెల్లడించారు. ఇక సునీల్‌ శెట్టి హీరోగానే కాదు కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నారు. ఇటీవల ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `మోసగాళ్లు` చిత్రంలో నటించారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న `గని` సినిమాలో నటిస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్