
హీరో సుమంత్ (Sumanth) వరుస సినిమాలతో జోరు పెంచుతున్నాడు. ఈ ఏడాది ఓటీటీలో రిలీజ్ అయిన ‘మళ్లీ మొదలైంది’తో ఫామ్ లోకి వచ్చాడు సుమంత్. ఈ చిత్రానికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. Malli Modalaindi చిత్రానికి టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాత కే రాజశేఖర్ రెడ్డి ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని నిర్మించారు. మూవీలో హీరో సుమంత్, హీరోయిన్ నైనా గంగూలీ (Naina Ganguly) ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటర్ గా పనిచేశారు. సౌండ్‌ట్రాక్‌ను అనూప్ రూబెన్స్ (Anuprubens) కంపోజ్ చేశారు. Zee5లో స్ట్రీమింగ్ అవుతోంది.
మళ్లీ మొదలైంది సినిమాతో వచ్చిన జోష్ తో సుమంత్ తన నెక్ట్ మూవీ చిత్రీకరణను కూడా పూర్తి చేస్తున్నారు. తాజాగా తను నటించిన చిత్రం ‘అహాం రీబూట్’ (Aham Reboot). ఈరోజు మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ ని ప్రముఖ రచయిత విజయంద్ర ప్రసాద్ ద్వారా లాంచ్ చేశారు. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అహం రీబూట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ మొదటివారంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం.
ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్...సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. చిత్ర పోస్టర్, కథ గురించి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యారన్నారు. చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని, ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగిందన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్ర యూనిట్ కు అభినందలు తెలిపారు.
సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం - ప్రశాంత్ సాగర్ అట్లూరి, సంగీతం - శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ - వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్
సూపర్ విజన్ - సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ గా ఏఆర్ వంశీ, సౌండ్ ఇంజనీర్ గా నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో బాధ్యతలను జీఎస్కే మీడియా చూస్తోంది. నిర్మాతలుగా రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు వ్యవహరిస్తున్నారు.