
కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth).. బ్యాండ్మింటన్ స్టార్ సైనాకు మరో సారి చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసు విచారణకు హాజరయ్యారు సిద్థు.
ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్(Saina Nehwal )కు కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మరోమారు క్షమాపణలు చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సైనాకు గతంలోనే సారీ చెప్పారు సిద్ధార్ధ్(Siddharth). రీసెంట్ గా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పంజాబ్ టూర్ లో భద్రతా వైఫల్యం వలన ఇబ్బిం పడ్డారు. దీనిపై దేశమంతా చర్చ సాగుతున్న వేళ. ఈ విషయం గురించి సైనా నెహ్వాల్ (Saina Nehwal ) ట్వీట్ చేశారు.
దాంతోహీరో సిద్ధార్థ్(Siddharth) సైనా ట్వీట్ పై వివాదాస్పద రీతిలో స్పందించాడు. ట్వీట్‌లో సిద్ధార్థ్ ఉపయోగించిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉండడంతో దేశమంతా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్(Siddharth) పై చర్యలు తీసుకోవాలంటూ తమిళనాడు పోలీసులను ఆదేశించింది. నిరసనలు తీవ్రం అవుతుండటంతో సిద్ధార్థ్ (Siddharth) వెంటనే సైనాకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్‌లో లెటర్ పోస్ట్ చేశాడు.
ఇది ఇలా ఉండగా.. మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి దర్యాప్తులో భాగంగా సిద్ధార్థ్ (Siddharth) కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అందడంలో విచారణలో.. భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసుల ఎదుట హాజరైన సిద్ధార్థ్ (Siddharth) .. సైనాపై తాను చేసిన వ్యాఖ్యల వెనక ఎలాంటి చెడు ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా ఆమెకు మరోమారు క్షమాపణలు తెలిపాడు.