మరోసారి హీరో సిద్ధార్థ్ నోటి దురుసు, పాన్ ఇండియా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు

Published : May 02, 2022, 11:23 AM IST
మరోసారి హీరో సిద్ధార్థ్ నోటి దురుసు, పాన్ ఇండియా సినిమాలపై సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యక్తులు, వ్యాఖ్యులు కామన్. ఆకోవలోకే వస్తాడు హీరో సిద్ధార్థ్. గతంలో తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తెలుగు సినిమాకు  చాలా కాలం దూరం అయిన సిద్ధార్థ్.. ఇప్పుడు మరో సారి నోటి దురుసు చూపించారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలపైన పడ్డాడు. -  

ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాస్పద వ్యక్తులు, వ్యాఖ్యులు కామన్. ఆకోవలోకే వస్తాడు హీరో సిద్ధార్థ్. గతంలో తెలుగు ఇండస్ట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తెలుగు సినిమాకు  చాలా కాలం దూరం అయిన సిద్ధార్థ్.. ఇప్పుడు మరో సారి నోటి దురుసు చూపించారు. ఈసారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలపైన పడ్డాడు. -

ఆసారి పాన్ ఇండియా సినిమాల మీద పడ్డాడు తమిళ హీరో సిద్ధార్థ్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వేలు పెట్టే హీరో.. ఈసారి పాన్ ఇండియా సినిమాలపై వివాదాస్పద వాఖ్యాలు చేశాడు. సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు సత్తా చాటుతుంటే.. అసలు పాన్ ఇండియా అనే పదాన్నే తీసేయాలంటున్నాడు సిద్ధార్ద్. మన సినిమాలు చూసి బాలీవుడ్ భయపడుతుంటే.. ఈ తరుణంలో సిద్ధార్థ్ మాటలు దుమారాన్ని రేపుతున్నాయి. 

ఇంతకీ  సిద్ధార్థ్ ఏమన్నాడంటే. పాన్ ఇండియన్ అనేది చాలా అగౌరవకరమైన పదమన్నాడు సిద్ధార్థ. పాన్ ఇండియన్ అనేది నాన్సెన్స్.. ఇక్కడ నిర్మించే అన్ని సినిమాలు భారతీయ సినిమాలే అంటున్నాడు.  ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా మూవీ వచ్చిందా..? 15 సంవత్సరాల క్రితం పాన్ ఇండియన్ సినిమా రాలేదా..? అంటూ ప్రశ్నించాడు. అప్పట్లో తన బాస్ మణిరత్నం రోజా  సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తీయలేదా..  ఈ సినిమా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసారు అంటున్నాడు సిద్ధార్థ్. 

అంతే కాదు రీసెంట్ గా తన స్నేహితులు కెజిఎఫ్ సినిమా తీశారని... అది ఒక భారతీయ సినిమా.. అని దానిని చూసి గర్వపడుతున్నానని అన్నాడు సిద్ధు.  సినిమాను ఎవరికి నచ్చిన భాషలో వారు చూసే హక్కు ప్రేక్షకులకు ఉంటుందన్నాడు. ఇది భారతీయ సినిమా .. కన్నడ పరిశ్రమ ఈ సినిమాను తయారుచేసింది. అస్సలు పాన్ ఇండియా.. పాన్ ఇండియా అని ఒకటే రచ్చ చేస్తున్నారు. నాకు తెలిసి పాన్ ఇండియా అనే పదమే తీసివేయాలి అని డిమాండ్ చేస్తున్నాడు సిద్ధు. 

అంతే కాదు పాన్ ఇండియా అనే పదం ప్లేస్ లో భారతీయ సినిమా అని పెట్టాలి.. అందరు అలాగే పిలవాలి అని చెప్పుకొచ్చాడు సిద్ధార్థ్.  అంతే కాదు సినిమాలను పాన్ ఇండియా అని కాకుండా.. ఏ భాషలో రూపొందిందో ఆ భాషతోనే పిలవాలన్నాడు. తమిళం.. తెలుగు సినిమాల్లో స్టార్డమ్ సంపాదించి బాలీవుడ్ కు వెళ్లినా తనను ఎవరూ సౌత్ ఇండియన్ యాక్టర్ అనరని కేవలం సౌత్ యాక్టర్ అని మాత్రమే అంటారన్నాడు సిద్దు.

ఒక సినిమా గొప్పగా రావాలంటే ఎంతోమంది టెక్నీషయన్లు కావాలి. వారికి భాషా భేదం ఉండదు.. తమిళ్ టెక్నీషయన్లు హిందీలో వర్క్ చేయడం లేదా.. తెలుగు నిర్మాతలు హిందీలో సినిమాలు తీయడం లేదా.. కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా,. ఏ భాషలోనైనా హిట్ అవుతుంది. దానికి పాన్ ఇండియా అని చెప్పి బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సిద్ధార్థ్.  ప్రస్తుతం సిద్ధార్థ చేసిన  వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి. కలకలం రేపుతున్నాయి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే