ప్రణయ్ హత్యపై హీరో రామ్ కామెంట్!

Published : Sep 17, 2018, 03:57 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
ప్రణయ్ హత్యపై హీరో రామ్ కామెంట్!

సారాంశం

ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నప్పటి నుండి రగిలిపోతున్న అమృత తండ్రి.. ప్రణయ్ ని హత్య చేయించిన సంఘటన తెలిసిందే. ఇప్పటికీ పరువు హత్యలు జరుగుతుండడంపై సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ విషయంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే సింగర్ చిన్మయి, మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించగా తాజాగా హీరో రామ్ కూడా మాట్లాడారు. ట్విట్టర్ వేదికగా ప్రణయ్ ని హత్యపై స్పందిస్తూ.. ''ఓ పక్క సెక్షన్ 377 ని తీసేస్తే.. ఇంకా ఈ కులాలు, పరువు హత్యలు ఏందిరా జంగిల్ ఫెలోస్. ముందు మనుషులుగా ఎలా బతకాలో తెలుసుకోండి'' అంటూ రాసుకొచ్చారు.

ప్రస్తుతం రామ్ 'హలో గురు ప్రేమ కోసమే' సినిమాలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కూడా చదవండి.. 

ప్రణయ్ హత్యపై మంచు మనోజ్ లెటర్!

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు